Mollywood : బడ్జెట్ రూ. 6 కోట్లు.. వసూళ్లు రూ. 50 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మాల్ బడ్జెట్ చిత్రాలు మాలీవుడ్ కు వరంగా మారాయి. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఓ చోటా పిక్చర్ సెన్సేషనల్ హిట్టు అందుకుంది. మంచి వసూళ్లను రాబట్టుకొంటుంది. ఈ ఏడాది విడుదల కాబోయే చిన్న సినిమాలకు బూస్టప్ గా మారింది. అలాగే మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రజెంటర్ గా మారి తన అసిస్టెంట్ ను డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తున్నాడు. మాలీవుడ్ లో సంక్రాంతిని టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలొచ్చాయి.
Also Read : NBK : అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను – బాలయ్య
Also Read
వాటిల్లో ఒకటి రేఖా చిత్రం. ఐడెంటిటీలాంటి స్టార్ట్ కాస్ట్ సినిమా బరిలో ఉన్నప్పటికీ డేర్ చేసి జనవరి 9న థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఆసిఫ్ అలీ, అనేశ్వర రాజన్ జంటగా నటించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్టు అందుకుంది. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జస్ట్ రూ. 6 కోట్టు పెట్టి నిర్మించగా రూ. 50 కోట్లను వసూలు చేసింది. ప్రీస్ట్ తో హిట్టు ఇచ్చిన జోఫిన్ టి చాకో ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యామియో రోల్ లో నటించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ, అన్ మెగా మీడియా పతాకంపై వేణు కున్నాప్పిల్లీ నిర్మించాడు. స్టార్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ప్రజెంటర్ గా మారబోతున్నాడు. తన దగ్గర అసోసియేట్ గా చేసిన మార్టిన్ జోసెఫ్ ను డైరెక్టర్ ను చేస్తున్నాడు. ఆర్డీఎక్స్ ఫేం షేన్ నిగమ్ హీరో. E4 ఎక్స్‌పెరిమెంట్స్ బ్యానర్‌పై ముఖేష్ ఆర్ మెహతా మరియు సివి సారథి బెడ్‌టైమ్ స్టోరీస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. షేన్ నిగమ్ తమిళ చిత్రం మద్రాస్కారన్ తో పలకరించాడు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!