టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీలో త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఎస్వీసీఎల్ఎల్ పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైయిట్ మూవీ ఇదే కావడం విశేషం. ఇక ధనుష్ కూడా ఈ చిత్రం గురించి చాలా ఆతృతగా ఉన్నారు. తాను ఆరాధించే దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరని, ఆయనతో కలిసి పని చేయడం ఎగ్జైటింగ్ గా ఉందని తెలుపుతూ ఇటీవలే ట్వీట్ కూడా చేశారు. ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు సినిమా బడ్జెట్ ఇదేనంటూ వార్తలు వస్తున్నాయి.
Read Also : ‘మా’ ప్రెసిడెంట్ గా పోటీ చేయనున్న జీవిత ?
శేఖర్ కమ్ముల-ధనుష్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా కోసం నిర్మాతలు దాదాపు 100 కోట్లు బడ్జెట్ కేటాయించనున్నారని అంటున్నారు. ఈ వార్తలు గనుక నిజమైతే శేఖర్ కమ్ముల ఫస్ట్ భారీ బడ్జెట్ మూవీ ఇదే అవుతుంది. ఆయన ఇంతకుముందు వరకూ తెరకెక్కించిన చిత్రాలన్నీ తక్కువ బడ్జెట్ లేదా మిడ్ రేంజ్ బడ్జెట్ లోవే. కానీ ఈసారి హీరో ధనుష్, అంతేకాకుండా ఇది త్రిభాషా చిత్రం కావడంతో ఈ వార్తలు నిజమేనని అన్పిస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతమేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.