బీటీఎస్ టీమ్ విడుదల చేసిన ‘బట్టర్’ సాంగ్ రికార్డులు బద్ధలు కొట్టటం అస్సలు ఆపటం లేదు. ఆన్ లైన్ లో బీటీఎస్ అభిమానుల్ని ‘ఆర్మీ’ అంటారు. ‘బట్టర్’ సూపర్ సక్సెస్ తో సొషల్ మీడియాలో ఆర్మీ హల్ చల్ తీవ్రంగా ఉంది. యూఎస్ బిల్ బోర్డ్ హాట్ 100 లిస్ట్ లో ఇంకా బీటీఎస్ న్యూ సాంగ్ నంబర్ వన్ గా కొనసాగుతూనే ఉంది. గతంలో బీటీఎస్ వారి ‘డైనమైట్’ పాట మూడు వారాలు టాప్ పొజీషన్ లో ఉండింది. ఇప్పుడు టాప్ వన్ గా ‘బట్టర్’ నాలుగో వారంలోనూ చెక్కుచెదరక కొనసాగుతోంది.
Read Also : అందరికీ హాలీవుడ్ లోకి ఎంట్రీ! అందుకే, జార్జ్ క్లూనీ ఫిల్మ్ స్కూల్…
ఇలా కంటిన్యూగా నాలుగు వారాలు నంబర్ వన్ గా ఉన్న పాటలు బిల్ బోర్డ్ చరిత్రలో 12 మాత్రమే. ‘బట్టర్’ 13వ గీతంగా గీటురాయి దాటేసింది! 1998లో చివరిసారి ఎయిరోస్మిత్ అనే గాయకుడు పాడిన ‘ ఐ డోంట్ వాంట్ టూ మిస్ ఏ థింగ్’ అనే పాట ‘ఆర్మగెడ్డాన్’ అనే సినిమా నుంచీ నాలుగు వారాలు నంబర్ వన్ గా కొనసాగింది. మళ్లీ రెండు దశాబ్దాల తరువాత ‘ఫోర్ వీక్స్ నంబర్ వన్’ రికార్డ్ ‘బట్టర్’ మాత్రమే సాధించగలిగింది!