NTV Telugu Site icon

Devara : ఆయుధపూజ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది..

Untitled Design (7)

Untitled Design (7)

జూనియర్ ఎన్టీఆర్‌ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని ఈ నెల 27న వరల్డ్ వైడ్  గా రిలీజ్ చేయనున్నారు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల వచ్చిన దేవర ట్రైలర్ రికార్డు వ్యూస్ రాబడుతూ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచింది.

Also Read : MAD Square : ఫస్ట్ లుక్ – ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది..

దేవర నుండి ఇప్పటికే మూడు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసారు మేకర్స్. తాజగా ఈ సినిమాలోని మోస్ట్ అవైటెడ్ నాలుగవ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సొంగ్ ను ఈ సెప్టెంబరు 19న 11: 07 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు. అటు ఒవర్సీస్ ప్రీ సేల్స్ లో దేవర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.  U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా 2 గంటల 57 నిమిషాల రన్ టైమ్ తో వస్తోంది. కాగా నేడు చిత్ర ప్రమోషన్స్ లో దూకుడు పెంచింది. తమిళ ప్రమోషన్స్ ముగించిన యూనిట్ బాలీవుడ్ ప్రమోషన్స్ కు చండీఘర్ లో ఈవెంట్ నిర్వహించనుంది. అటు మలయాళంలోను మరో ఈవెంట్ నిర్వహించేలా ప్లాన్ చేస్తుంది యూనిట్. మరోవైపు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 22 న భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని నోవాటెల్ HICC  ఈ వేడుకకు వేదిక కానుంది

Show comments