Jr.NTR Speech at Brahmastra: నా అభిమానులకు క్షమాపణలు.. ఎంతో ఆర్భాటంగా వేడుక చేయాలనుకున్నాం.. కానీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రహ్మాస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. చివరి నిమిషంలో ఈవెంట్ రద్దు చేయడంతో NTRను చూసే ఛాన్స్ పోయిందని వాపోయారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చామని, చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం ఏంటని ప్రశ్నించారు. ఇందులో రాజకీయ కోణం ఉందని, NTR దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నందుకు తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అయితే దీనిపై స్పందించిన ఎన్టీఆర్ నిన్న (శుక్రవారం) సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదాపై మాట్లాడారు. ఈవెంట్ వేదికకు వచ్చిన.. రావాలనుకున్న నా అభిమానులకు ముందుగా క్షమాపణలని, మీరు వేడుకకు రాకపోయినా మంచి చిత్రాలను, నన్ను ఆదరిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. అంతేకాదు మీడియానూ కూడా క్షమాపణలు కోరుకుతున్నా అని అన్నారు. వినాయక విగ్రహ నిమజ్జనాల నేపథ్యంలో అధిక బందోబస్తును ఏర్పాటు చేయలేమని పోలీసులు తెలుపడంతో.. వారు చెప్పింది వినటం మన ధర్మమని, అందుకే వారికి సహకరించి మేం ఇలా చిన్న వేదికపై నుంచి మీతో మాట్లాడుతున్నామన్నారు. తను కూడా చాలా మంది నటులను ఇష్టపడతా, అమితాబ్ బచ్చన్ ప్రభావం ఓ నటుడిగా నాపై చాలా ఉంది. అయితే.. ఆయనకు నేను వీరాభిమానిని. ఆయన తరువాత నేనంతగా ఇష్టపడేది రణ్‌బీర్‌నే.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
అందుకే అతనితో కలిసి ఈ వేదికను పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇంతమంచి అవకాశం ఇచ్చిన రాజమౌళికి ధన్యవాదాలు అని తెలిపారు. ఈచిత్రానికి అలియా, అయాన్.. పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. టాలీవుడ్ నటుడు హిందీ సినిమాలో నటించి, హిందీ మాట్లాడితే ఎలా ఉంటుందనేది నాగార్జున బాబాయ్ ఖుదా గవా చూసి తెలుసుకున్నా అని అన్నారు. ఇక బ్రహ్మాస్త్రంలోనూ ఆయన హిందీ మాట్లాడారనుకుంటున్నానని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో చిత్ర పరిశ్రమ ఒత్తిడికి లోనవుతోంది, ప్రేక్షకుడికి ఇప్పుడు మనం ఇస్తున్నదానికంటే కొత్తది ఇంకేదో కావాలి. ఇలాంటి ఒత్తిడిలోనే బాగా పనిచేస్తామని నేను నమ్ముతానని అన్నారు ఎన్టీఆర్.. ఈ ఛాలెంజ్‌ని ఇండస్ట్రీ స్వీకరించాలన్నారు. అయితే.. నేను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడటం లేదని అన్నారు ఎన్టీఆర్. తన అభిమానులకు, ప్రేక్షకులకు మంచి కథలను అందించేందుకు ప్రయత్నిద్దామని మరిన్ని గొప్ప చిత్రాలు చేద్దాం అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..