బాలీవుడ్ బడా ఖాన్ సల్మాన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘రాధే’. ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకుడు. దిశా పటాని హీరోయిన్. ముంబై క్రైమ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా థియేటర్ల రిలీజ్ తో పాటు నిన్నటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సల్మాన్ సినిమా కావడంతో తొలి రోజున సూపర్ రెస్పాన్స్ తో స్ర్టీమ్ అయింది. అయితే ఇటీవల కాలంలో పలు బాలీవుడ్ చిత్రాలకు తగిలిన బ్యాయ్ కాట్ సెగ ఈ చిత్రానికి కూడా తగిలింది. సోషల్ మీడియాలో ‘రాధే’ చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలని నెటిజన్స్ పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. నెపోటిజం సహా గత ఏడాది మరణించిన టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సానుభూతిపరులు ఈ ట్రెండ్ కు కారణమని భావిస్తున్నారు. ఈ ‘బాయ్ కాట్ రాధే’ హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతుండటం విశేషం.