Akhanda 3: శంబాల నుంచి మొదలు.. అఖండ 3 లీక్ ఇచ్చేసిన బోయపాటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోస్ట్ అవైటెడ్ సినిమా ‘అఖండ తాండవం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ లభించింది. ఈ నేపథ్యంలో కలెక్షన్లు కూడా గట్టిగానే వస్తున్నాయి.
‘
అఖండ’ సినిమా 2021లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా చివరిలో కూడా మరో భాగానికి అవకాశం ఉంది అన్నట్టుగా ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు. ఈ సినిమా ఎండింగ్‌లోనే శంబాల అనే ప్రాంతానికి అఖండ వెళుతూ ఉండడం చూపించారు.
ఇక తాజాగా మీడియాతో ముచ్చటించిన బోయపాటి శ్రీను, అఖండ మూడవ భాగం అక్కడి నుంచే ప్రారంభం కాబోతుందని క్లారిటీ ఇచ్చేశారు. “అక్కడ ముగించాం కాబట్టి అక్కడి నుంచే ప్రారంభించాల్సి ఉంటుందంటూ” ఆయన మాట్లాడారు. అయితే, అఖండ నుంచి ‘అఖండ 2’కు స్పాన్ (విస్తృతి) పెరిగిందని, ఇప్పుడు మూడవ భాగానికి ఆ స్పాన్ మరింత పెరుగుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాని సంయుక్తంగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే, రిలీజ్ కావాల్సిన రోజు వాయిదా పడిన ఈ సినిమా ఒక వారం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా ప్రభావం చూపిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Empty Medicine Packets Reuse: ఖాళీ టాబ్లెట్ స్ట్రిప్స్‌తో ఎన్నో లాభాలు.. ఈ విషయం తెలిస్తే పొరపాటున కూడా చెత్తబుట్టలో వేయరు..
-
Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో ఇజ్రాయెల్‌కు నష్టమే.. రాయబారి రూవెన్ అజార్ కీలక వ్యాఖ్యలు
-
Sajjad Nomani: హిందువులు దేశంలో మెజారిటీ కాదు.. మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Mahendragiri Varahi: మైండ్ బ్లాక్ చేస్తున్న సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’!
-
Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
ట్రెండింగ్
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!