టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన అభినవ్ మణికంఠ హీరోగా “బొమ్మ హిట్” సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపొందుతున్న ఈ సినిమాని గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రాజేష్ గడ్డం దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. నేడు జరిగిన పూజా కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చిత్ర యూనిట్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు హీరో అభినవ్ మణికంఠ మాట్లాడుతూ “హీరోగా ఇది నా రెండో సినిమా. ఇందులో సిచువేషనల్ కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే ఎమోషన్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు ఉన్న ఆదరణ చూస్తుంటే, మా ‘బొమ్మ హిట్’ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను.” అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కమెడియన్లు పాల్గొని సినిమాపై తమదైన శైలిలో స్పందించారు. వినోదంతో పాటు సందేశాన్ని కలిపి అందిస్తున్న ఈ “బొమ్మ హిట్”, వచ్చే ఏడాది వేసవి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.