Site icon NTV Telugu

Tollywood : బాలీవుడ్ సీనియర్ బ్యూటీస్ బ్యాక్ టు టాలీవుడ్

Tollywood

Tollywood

ఇండియన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేని బ్యూటీస్ టబు అండ్ రవీనా టాండన్. 90స్‌లో కుర్రాళ్ల క్రష్‌గా మారిన భామలు 50 క్రాసైనా ఇప్పటికీ అదే అందం, అదే గ్లామర్ తో యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. తల్లి పాత్రలకు షిఫ్టైనా కూడా ఇప్పటికీ హీరోయిన్‌, మెయిన్ యాక్ట్రెస్‌గా ఆఫర్లను కొల్లగొడుతూనే ఉంది టబు. ఇక రవీనా కూడా కీ రోల్స్ చేస్తూ సీనియర్ బ్యూటీలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ ఇద్దరూ చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

Also Read : Darling : ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్.. అనౌన్స్‌మెంట్‌ రెడీ

కూలీ నెంబర్ వన్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన టబు తెలుగులో చేసినవీ కొన్ని సినిమాలే అయినా గుర్తిండిపోయే పాత్రలే చేసింది. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో జోడీ కట్టింది. పాండురంగడు తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి అలా వైకుంఠపురంతో మదర్ రోల్స్‌లో పలకరించిన టబు మళ్లీ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత పూరీ జగన్నాథ్- విజయ్ సేతుపతి సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే నాగ్ 100మూవీలోనూ నటించబోతుందన్న టాక్.

రధ సారధితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రవీనా టాండన్ బంగారు బుల్లోడు చిత్రంతో క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో స్వాతిలో ముత్యమంతా పాటలో రవీనా డాన్స్ కు ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో ఫింగర్ టిప్స్‌పై లెక్కించగలిగేంత సినిమాలే చేసినా, బాలయ్య భామగా గుర్తిండిపోయింది. పాండవులు పాండవులు తుమ్మెద తర్వాత మళ్లీ తెలుగు వైపు చూడని రమికా సేన్  నెక్ట్స్ పీఎం మోడీ బయోపిక్ మా వందేతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. పీఎం మోడీ మదర్ హీరా బెన్ పాత్రలో మెరవబోతుంది. అలాగే సూర్య 46లో కీ రోల్ ప్లే చేస్తుంది రవీనా. 50 ప్లస్‌లో కూడా ఆఫర్లను కొల్లగొడుతూ సీనియర్ భామలకు ఓ దారి చూపిస్తున్నారు ఈ యాక్టర్లు..

Exit mobile version