Site icon NTV Telugu

Adipurush Actor: ప్రభాస్ సినిమా “ఆదిపురుష్” యాక్టర్ కన్నుమూత

Aasha Sharma

Aasha Sharma

టీవీ ఇండస్ట్రీ నుంచి ఓ విషాద వార్త బయటకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా శర్మ (88) కన్నుమూశారు. అయితే దీని వెనుక కారణం ఇంకా వెల్లడి కాలేదు. ఆశా గత 4 దశాబ్దాలుగా టీవీ, చిత్ర పరిశ్రమలో మంచి పాత్రలు పోషించారు. ఈ నటి అమ్మ, అమ్మమ్మ పాత్రలను పోషించారు. ఆశా శర్మ మరణ వార్తను సినీ మరియు టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ధృవీకరించింది. ఆశాకు నివాళులు అర్పిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రాసుకొచ్చింది.

READ MORE: Kiccha Sudeep: అయ్యబాబోయ్.. హీరో సుదీప్‌కు ఇంత పెద్ద కూతురా..? హీరోయిన్‌ లు కూడా పనికి రారుగా..

అయితే ఆశా మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆశా ‘దో దిశయాన్’, ‘ముఝే కుచ్ కెహనా హై’, ‘ప్యార్ తో హోనా హి థా’, ‘హమ్ తుమ్హారే హై సనమ్’ వంటి చిత్రాలలో కనిపించింది. 1982లో హేమమాలిని, ధర్మేంద్ర నటించిన ‘దో దిశాయేన్’ చిత్రంలో శ్రీమతి నివారణ్ శర్మ పాత్రను ఆశా పోషించింది. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రంలో నిరుపా రాయ్, అరుణా ఇరానీతో పాటు ప్రేమ్ చోప్రా కూడా ప్రధాన పాత్రలో కనిపించారు.

READ MORE: Howrah murder: జ్వరానికి క్యాన్సర్ మందులు.. ప్రియుడితో కలిసి భార్య దుర్మార్గం..

అయితే ఆశా శర్మ చివరిగా ప్రభాస్, కృతి సనన్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రంలో కనిపించారు. శబరి పాత్రలో ఆశా నటించారు. స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేయడానికి సరిపోతుంది. అంతే కాకుండా ఆమె టీవీలో ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’, ‘కుంకుమ్ భాగ్య’లో కనిపించారు. ఆశా తన 4 దశాబ్దాల కెరీర్‌లో దాదాపు 40 సినిమాలు, అనేక టీవీ షోలు చేశారు. స్టార్ పరివార్ అవార్డ్స్‌లో ఆశా ఫేవరెట్ వృద్ధుల అవార్డును గెలుచుకున్నారు. అభిమానులు ఆశాకి నివాళులు అర్పిస్తున్నారు.

Exit mobile version