మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ బాబీ కాంబోలో వచ్చిన సినిమా వాల్తేర్ వీరయ్య. 2023సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వరుస ఫ్లోప్స్ తో సతమతమవుతున్న మెగాస్టార్ కు ఆ సినిమా బ్రేక్ వేసి సక్సెస్ ఇచ్చింది. మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజా రవితేజ ఈ కీలక పాత్రలో కనిపించగా దర్శకుడు బాబీ ఇద్దరు హీరోలను చక్కగా హ్యాండిల్ చేసాడు. ముఖ్యంగా చిరులోని వింటేజ్ ఫన్ టోన్ ను మరోసారి చూపించాడు బాబీ.
Also Read : September Clash : అఖండ 2 vs OG.. నీ యవ్వ తగ్గేదేలే..
కాగా మరోసారి మెగాస్టార్ , బాబీ కాంబో రిపీట్ కానుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘విశ్వంభర’ షూటింగ్ ముగించేశారు. సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకులు అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా కూడా ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకుంది. ఇప్పుడీ రెండు ప్రాజెక్ట్లు కాకుండా తనకు ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఘన విజయాన్ని అందించిన దర్శకుడు బాబీ కొల్లితో మరోసారి సినిమా చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన డాకు మహారాజ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాబీ అదే జోష్ లో మెగాస్టార్ తో సినిమా కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథ రెడీ చేసాడట. ఈ ఏడాది సెప్టెంబర్ లో బాబీ – మెగాస్టార్ సినిమాల మొదలు కానుంది. అలాగే యంగ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమాను ప్రకటించిన చిరు. ఆ సినిమాను బాబీ సినిమా తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.