Tollywood : టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్లాప్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బిగ్ బ్యానర్?

People Media Factory

People Media Factory

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్రెండ్ మార్చబోతోంది. ఈ ఏడాది ఆరంభంలో ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ‘రాజా సాబ్’ చిత్రంతో ఈ సంస్థ ఊహించని విధంగా బిగ్గెస్ట్ ప్లాప్ అందుకుంది. ఈ సినిమా ఫలితం ఇచ్చిన షాక్‌తో కొన్నాళ్లుగా కొత్త సినిమాల నిర్మాణానికి, ప్రొడక్షన్ వ్యవహారాలకు ఈ సంస్థ కాస్త దూరంగా ఉంటూ వస్తోంది. అయితే ఈ గ్యాప్‌లో సరికొత్త వ్యూహంతో బాలీవుడ్ మార్కెట్‌పై కన్నేసారు మేకర్స్.

తాజా సమాచారం ప్రకారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బాలీవుడ్‌లో ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కార్తికేయ-2, తండేల్ చిత్రాల దర్శకుడు చందు మొండేటి బాలీవుడ్ యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్కు ఒక పవర్‌ఫుల్ లైన్ వినిపించారట. ఈ కథ టైగర్ ష్రాఫ్‌కు విపరీతంగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. తెలుగు దర్శకుడు, బాలీవుడ్ హీరో, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కలయికలో రాబోతున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని సమాచారం. ‘రాజా సాబ్’ ప్లాప్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావడమే కాకుండా హిందీ బెల్ట్‌లో కూడా స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

×
×
Ad