Tollywood : టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్లాప్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బిగ్ బ్యానర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్రెండ్ మార్చబోతోంది. ఈ ఏడాది ఆరంభంలో ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ‘రాజా సాబ్’ చిత్రంతో ఈ సంస్థ ఊహించని విధంగా బిగ్గెస్ట్ ప్లాప్ అందుకుంది. ఈ సినిమా ఫలితం ఇచ్చిన షాక్‌తో కొన్నాళ్లుగా కొత్త సినిమాల నిర్మాణానికి, ప్రొడక్షన్ వ్యవహారాలకు ఈ సంస్థ కాస్త దూరంగా ఉంటూ వస్తోంది. అయితే ఈ గ్యాప్‌లో సరికొత్త వ్యూహంతో బాలీవుడ్ మార్కెట్‌పై కన్నేసారు మేకర్స్.
తాజా సమాచారం ప్రకారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బాలీవుడ్లో ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కార్తికేయ-2, తండేల్ చిత్రాల దర్శకుడు చందు మొండేటి బాలీవుడ్ యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌కు ఒక పవర్ఫుల్ లైన్ వినిపించారట. ఈ కథ టైగర్ ష్రాఫ్‌కు విపరీతంగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. తెలుగు దర్శకుడు, బాలీవుడ్ హీరో, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కలయికలో రాబోతున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని సమాచారం. ‘రాజా సాబ్’ ప్లాప్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావడమే కాకుండా హిందీ బెల్ట్‌లో కూడా స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
Also Read
- Ramya Krishnan Birthday: 'కమలా రెడ్డి'గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
- Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
- Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
- Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
తాజావార్తలు
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!