Bigg Boss Telugu 10: ఇక బిగ్ బాస్ సందడే.. ఈరోజు నుంచి షో స్టార్ట్.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!

Bigg Boss Telugu10

Bigg Boss Telugu10

Bigg Boss Telugu 10: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ నేటి నుంచే ప్రారంభం కానుంది. గత కొంతకాలంగా హౌజ్‌లోకి ఎవరెవరు అడుగుపెడతారనే దానిపై సోషల్ మీడియాలో భారీగా ఊహాగానాలు, యూట్యూబ్‌లో వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాస్ టీమ్ ఈసారి కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో సీక్రెట్ మెయింటైన్ చేయడంలో చాలావరకు సక్సెస్ అయ్యిందని చెబుతున్నారు.అయితే కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో మాత్రం మిక్సిడ్ రియాక్షన్ వ్యక్తమవుతోంది. లాస్ట్ సీజన్లతో పోలిస్తే ఈసారి హౌజ్‌లోకి అడుగుపెడుతున్న సెలబ్రిటీల విషయంలో పెద్దగా పేరున్న వాళ్లు కనిపించడం లేదని చెబుతున్నారు. లాస్ట్ సిజన్‌లాగానే ఈసారి కూడా ‘అగ్నిపరీక్ష’ ద్వారా పలువురు కానమర్స్‌కి టాస్కులు నిర్వహించి వారిలో కొంత మందిని ఎంపిక చేశారు. ఇలా ఎంపిక చేసిన వారిలో కొందరిని హౌజ్‌లోకి పంపించగా.. మరో ఇద్దరిని రిజర్వ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. వారిని అవసరాన్ని బట్టి హౌజ్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

జబర్దస్త్ నుంచి ఇద్దరు

ఈసారి జబర్దస్త్ నుంచి ఏకంగా ఇద్దరు కమెడియన్లు హౌజ్‌లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరు ఆటో రాంప్రసాద్. తన స్పాంటేనియస్ ఆటో పంచ్‌లతో షోలో రాంప్రసాద్ ఎంటర్‌టైన్ చేయగలడనే అంచనాలు ఉన్నాయి. అవినాష్, ఇమాన్యుయెల్ తరహాలో హౌజ్‌లో రాంప్రసాద్ కూడా కామెడీని పండించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో వ్యక్తి నరేష్ అని సమాచారం. ఇతను కూడా తనదైన కామెడీతో కొంతకాలం షో లో అలరించే ఛాన్స్ ఉంది. బుల్లితెర షోల ద్వారా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి సౌందర్‌రాజన్ ఈ సీజన్‌లో గ్లామర్ స్పేస్‌ను ఫిల్ చేసే కంటెస్టెంట్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే గతంలో పలు సినిమాల్లో హీరోగా నటించిన కృష్ణుడు కూడా ఈసారి హౌజ్‌లోకి వస్తున్నట్లు సమాచారం. అయితే ఆఫ్‌స్క్రీన్‌లో ఆయన వ్యక్తిగతంగా పెద్దగా పబ్లిసిటీకి దూరంగా ఉండటంతో.. టాస్కులు, గేమ్స్‌లో ఎలా ఆడతారనేది వేచి చూడాలి. శాలిని, ముఖేష్ గౌడ, టెంపర్ వంశీ, శ్రష్టి వ్యాకరణం, ఆర్‌జే చరణ్, డెబ్ జానీ, చైత్రా రాయ్, నవరసాలు ఆర్కే, సుధీర్ రెడ్డి తదితర పేర్లు కూడా కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి. అజిత్ ఈశ్వరన్, రోహిత్ వంటి పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఝాన్సీపై ఆసక్తి
కంటెస్టెంట్లలో సింగర్ ఝాన్సీ మాత్రం ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నారనే అభిప్రాయాలు ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి. ఆమె కేవలం సింగర్ మాత్రమే కాకుండా వ్యవసాయం కూడా చేస్తుండటం ఆమెను మిగితా వాళ్ల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టిందని చెబుతున్నారు. మంచి వాగ్దాటి, ప్లెజెంట్ అప్పియరెన్స్ ఉండటంతో పాటు తనదైన వ్యక్తిత్వంతో ఆమె ఈ షోలో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని టాక్. ‘అగ్నిపరీక్ష’ నుంచి బిగ్‌బాస్ టికెట్ అందుకున్న తొలి కంటెస్టెంట్‌గా ఆమెకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. మరోవైపు కామనర్స్‌గా అమన్ దీపక్, రాజకుమారి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, టీవీ, రీల్స్, షార్ట్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారనే అభిప్రాయాలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులను ఎంపిక చేసి ఉంటే హౌజ్‌లో మరింత వైవిధ్యం కనిపించేదనే కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ కంటెస్టెంట్ల అసలు సత్తా మాత్రం హౌజ్‌లోకి వెళ్లిన తర్వాతే తేలనుందని అంటున్నారు. ఎవరు గేమ్‌ను అర్థం చేసుకుని ముందుకు వెళ్తారు? ఎవరు టాస్కుల్లో మెరుస్తారు? ఎవరు గొడవలతో ఫోకస్‌లోకి వస్తారు? ఎవరు ప్రేక్షకుల ఫేవరెట్‌గా మారతారు? అనేది ఇకపై ఆసక్తికరంగా మారనుంది. అలాగే షో స్టార్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ టీం ఎలిమినేషన్ల విషయంలోనూ సీక్రెసీ కొనసాగిస్తే షో మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.