NTV Telugu Site icon

Big shock for Hero Nani: నానికి పెద్ద షాక్

Big Shock For Hero Nani

Big Shock For Hero Nani

Big shock for Hero Nani: తెలుగు చిత్రపరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకుండా ఎదిగిన హీరోల్లో నాని కూడా ఒకరు. ‘అష్టా చెమ్మ’తో కెరీర్ ఆరంభించి అనతి కాలంలోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. నేచులర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని ప్రస్తుతం కెరీర్ లో టఫ్ ఫేజ్ లో ఉన్నాడు. ఇటీవల కాలంలో విడుదలైన నాని సినిమాలు పూర్తిగా నిరాదరణకు గురవుతున్నాయి. 2017ల వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ తర్వాత సరైన కమర్షియల్ హిట్ లేదు. మధ్యలో ‘జెర్సీ’ పర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన ‘గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీష్, శ్యామ్ సింగ్ ఆయ్, అంటే సుందరానికి’ సినిమాలు నాని కెరీర్ గ్రాఫ్ ని ఏ మాత్రం పెంచలేక పోయాయి. వీటిలో పలు చిత్రాలు థియేట్రికల్ గా ఫెయిల్ అయినా టెలివిజన్ లో పర్వాలేదనిపించాయి. అయితే చివరి సినిమా ‘అంటే సుందరానికి’ మాత్రం అక్కడా నిరాదరణకు గురై నానికి అతి పెద్ద షాక్ ఇచ్చింది.

నిజానికి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ ప్రదర్శితమయ్యే సినిమాలు ఏవైనా 10-20 మధ్య ఏదో ఒక టిఆర్ పిని సాధిస్తుంటాయి. ఇక అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా తొలి ప్రీమియర్ లో 29 టీఆర్‌పీ సాధించి నెంబర్ వన్ స్థానంలో చెక్కుచెదరకుండా ఉంది. అయితే ఇటీవల వస్తున్న పెద్ద సినిమాలు ఎందుకో ఏమో అతి తక్కువ టీఆర్‌పీలను పొందుతున్నాయి. ప్రత్యేకించి నాని తాజా చిత్రం ‘అంటే సుందరానికి’ 1.8 టిఆర్ పి నమోదు చేసి అటు నానికి ఇటు ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ వారికి పెద్ద షాక్ ఇచ్చింది. నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాల శాటిలైట్ బిజినెస్ పై దీని ప్రభావం బాగానే పడనున్నట్లు చెబుతున్నారు. దీనిని పలు కారణాలు వినవస్తున్నాయి.

ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడి ఉండటం. తొలి సారి ప్రీమియర్ తో పాటు ఆ తర్వాత శాటిలైట్ ఛానెల్స్ లో ప్రసారం అయ్యే సినిమాలకు ప్రకటన రూపంలో ప్రేక్షకులకు నరకం చూపించటమే. అదే ఓటీటీలో అయితే ప్రకటనలు తక్కువ. ఉన్నా చేతిలో రిమోట్ లో హాయిగా ముందుకు జరుపుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు. ‘అంటే సుందరానికి’ విషయంలో ఇదే జరిగింది. ఆ సినిమా ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. దాంతో థియేటర్లలో చూడని వారంతా అక్కడ చూసేశారు. ఇది సినిమాల విషయంలోనే కాదు సీరియల్స్ విషయంలోనూ ప్రభావం చూపిస్తోంది. గతంలో 15 నుంచి 20 వరకూ టీఆర్ పీలు సాధించిన సీరియల్స్ ఇప్పుడు 7, 8 దాటడమే గగనం అవుతోంది. ఇప్పుడు నానికి జరిగిందే రేపు టాప్ స్టార్స్ అందరికీ జరగవచ్చు. మరి దీనికి పరిష్కారం ఏమిటన్నది కాలమే నిర్ణయించాలి. అప్పటి వరకూ వెయిట్ అండ్ సీ…
Munugode By Poll : నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం..