జబర్దస్త్ ఫేమ్ యాదమ్మ రాజు, ఇమాన్యుయేల్ వంటి యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్స్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సరికొత్త చిత్రం ‘భూతం ప్రేతం’. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ మరియు పోస్టర్లతో క్యూరియాసిటీ పెంచిన చిత్ర యూనిట్, తాజాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రేక్షకులకు అదిరిపోయే మ్యూజికల్ ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి ‘చికెన్ పార్టీ’ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పేరుకు తగ్గట్టుగానే ఈ పాట ఫుల్ పార్టీ మూడ్‌లో సాగుతోంది. ఈ పాటను స్వయంగా చిత్ర దర్శకుడు రాజేష్ ధృవ రచించగా, అనిరుధ్ శాస్త్రి తన గాత్రంతో ప్రాణం పోశారు గిరీష్ హోతుర్ అందించిన బీట్స్ పార్టీ ప్రియులను స్టెప్పులేయించేలా ఉన్నాయి.
పాటలో యాదమ్మ రాజు, బిందాస్ భాస్కర్, ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్ మరియు రాజేష్ ధృవ తమదైన స్టైల్లో డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. సృజన ప్రొడక్షన్స్ మరియు ఈషా ఫిల్మ్స్ బ్యానర్లపై బి. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.