Site icon NTV Telugu

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేపై ఐరెన్‌ లెగ్‌ ముద్ర చెరిగేదెప్పుడు?

Bhagyashri Borse Interview

Bhagyashri Borse Interview

గ్లామర్‌తో ఆకట్టుకునే నటీమణులలో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. కానీ, ఆమె కెరీర్ ప్రారంభం నుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. “భాగ్యశ్రీ బోర్సే గ్లామర్‌గా వుంటుందేగానీ… పెర్‌ఫార్మెన్స్‌ నిల్‌” అంటూ విమర్శకులు తేల్చేశారు. అయితే, ఈ విమర్శలకు సమాధానం ఇవ్వడానికి భాగ్యశ్రీ ప్రయత్నించింది. స్కిన్‌షోతోపాటు… యాక్టింగ్‌ కూడా చూపించినా, బాక్సాఫీస్‌ మాత్రం ఈ అమ్మడిని కరుణించలేదు. దీంతో సినీ వర్గాల్లో ఆమెపై ‘భాగ్యశ్రీ వుంటే ఫ్లాపే’ అన్న ముద్ర (ఐరన్ లెగ్) పడిపోయింది.

Also Read :Prabhas : డార్లింగ్‌కు జక్కన్న పంపిన స్పెషల్ లేఖ..వైరల్

డెబ్యూ మూవీ ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ, ఆమెకు వరుస ఆఫర్స్ రావడం విశేషం. రెండో సినిమా ‘కింగ్‌డమ్‌’కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇందులో భాగ్యశ్రీకి గుర్తింపులేని క్యారెక్టర్‌ దక్కింది. దుల్కర్‌ సల్మాన్‌తో జోడీగా ‘కాంత’ కమర్షియల్‌గా ఫ్లాప్‌ అయినప్పటికీ, ఇందులో భాగ్యశ్రీకి మంచి పెర్‌ఫార్మెన్స్‌ రోల్‌ లభించింది. తనపై ఉన్న నటన రాదన్న విమర్శకులకు దీన్ని ఒక సమాధానంగా చెప్పవచ్చు. ఇక ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’: ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ లభించింది. అయినప్పటికీ, థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కలేదు. వరుస పరాజయాలు మరియు ప్రేక్షకుల ఆదరణ లేకపోవడం భాగ్యశ్రీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం ఆమె చేతిలో మరో మూవీ లేని పరిస్థితి ఉంది.

Also Read :November Tollywood: చిన్న సినిమాల హవా, మూడు మాత్రమే బ్రేక్ ఈవెన్

సినిమా ఫలితాలకు సంబంధం లేకుండా నటిపై ‘ఐరన్ లెగ్’ వంటి ముద్రలు వేయడం ఎంతవరకు సమంజసమనే చర్చ పక్కన పెడితే, భాగ్యశ్రీ బోర్సే తక్షణ సవాలు ఏమిటంటే… తన తదుపరి సినిమాతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడం. నటనపై వస్తున్న విమర్శలకు ‘కాంత’తో జవాబిచ్చినా, ఇప్పుడు ఆమెకు కావలసింది కమర్షియల్ సక్సెస్ మాత్రమే.
మరి, ఈ ‘ఐరన్ లెగ్’ ముద్ర నుంచి ఈ అమ్మడు కోలుకుని, మళ్లీ బిజీ హీరోయిన్‌గా మారేది ఎప్పుడు? అనేది సినీ అభిమానుల ప్రశ్నగా మిగిలిపోయింది.

Exit mobile version