Bhagyashri Borse: స్టార్స్టేటస్కి ఒక్క అడుగు దూరంలో భాగ్యశ్రీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మోడల్ కమ్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా, తన స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది భాగ్యశ్రీ. ఆ తర్వాత వచ్చిన ‘కింగ్డమ్’, ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ సినిమాల్లో నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ.. తన అందంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దాంతో ఫెయిల్యూర్స్ ఎదురైనా అవకాశాలు మాత్రం తగ్గలేదు.
అయితే భాగ్యశ్రీ కెరీర్‌కు నిజమైన టర్నింగ్ పాయింట్ ఇచ్చింది మాత్రం ‘కాంత’, ‘లెనిన్’ చిత్రాలే అని చెప్పాలి. ‘కాంత’ సినిమాలో తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇక రీసెంట్గా వచ్చిన ‘లెనిన్’ సినిమాలో తన పాత్రతో మెప్పించి, సినిమా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసింది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు.. పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్లను కూడా సమర్థవంతంగా చేయగలనని నిరూపించుకోవడంతో భాగ్యశ్రీ మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. ఈ సక్సెస్ తెచ్చిపెట్టిన క్రేజ్‌తో తన రెమ్యునరేషన్‌ను కూడా డబుల్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇక ఇప్పుడు భాగ్యశ్రీ కెరీర్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే మరో బిగ్ ఆఫర్ తలుపు తట్టింది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘బ్లడీ రోమియో’లో భాగ్యశ్రీ హీరోయిన్గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే, నాని సరసన ఫస్ట్ టైమ్ నటించే అవకాశం రావడంతో పాటు భాగ్యశ్రీ కెరీర్‌కు ఇది బిగ్ బూస్ట్ కానుంది.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!