Site icon NTV Telugu

Bhagyashri Borse : అందమా, లక్కా.. త్వరలో తేలనుంది!

Bhagyashri Borse

Bhagyashri Borse

టాలీవుడ్‌లో కొందరు హీరోయిన్‌లకు అదృష్టం త్వరగా కలిసి రాదు. ఎంత అందం ఉన్నా, అభినయం ఉన్నా… విజయాలు వారి చెంతకు చేరవు. సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఈమె అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, వరుసగా ఎదురవుతున్న ఫ్లాప్‌ల కారణంగా ‘ఐరన్ లెగ్’ ముద్రను మోయాల్సి వస్తోంది. భాగ్యశ్రీ బోర్సే చూడగానే ఆకట్టుకునే గ్లామర్‌తో యూత్‌లో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే, ఈ మధ్యకాలంలో కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, తన పెర్ఫార్మెన్స్‌తో విమర్శకులను సైతం మెప్పించి షాక్ ఇచ్చింది. టాలెంట్ ఉన్నప్పటికీ, సరైన హిట్‌ను అందుకోలేకపోవడం ఆమెకు పెద్ద లోటుగా మారింది.

Also Read :Anchor Shivajyothi : తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు.. వివాదంలో శివజ్యోతి

భాగ్యశ్రీ నటించిన తొలి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. డెబ్యూ ఫ్లాప్ అయినప్పటికీ, ఆమెకు వరుసగా ఆఫర్లు రావడం విశేషం. ఆమె నటించిన రెండో చిత్రం ‘కింగ్‌డమ్’ కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీకి చెప్పుకోదగ్గ, గుర్తింపు ఉన్న పాత్ర లభించలేదు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన జోడీ కట్టిన సినిమా ‘కాంత’. ఈ చిత్రం కూడా కమర్షియల్‌గా ఫ్లాప్ అయింది. అయితే, ఇందులో కమర్షియల్ విజయం దక్కకపోయినా, ఆమె పాత్రకు పెర్ఫార్మెన్స్ స్కోప్ బాగా లభించింది. పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నప్పటికీ, కమర్షియల్ సక్సెస్ దూరమైంది. దీంతో, భాగ్యశ్రీకి ప్రస్తుతం ఇండస్ట్రీలో హ్యాట్రిక్ ఫ్లాప్‌లు పడినట్లైంది.

Also Read :IBomma Ravi: ఐబొమ్మ రవికి ప్రజల మద్దతు… ఖండించిన నిర్మాత బన్నీ వాసు!

ఐరన్ లెగ్ ముద్రను చెరిపేసుకునేందుకు భాగ్యశ్రీ ఇప్పుడు తన నాలుగో సినిమాపైనే పూర్తి ఆశలు పెట్టుకుంది. ఆమె హీరో రామ్ సరసన జోడీ కట్టిన చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ఈ చిత్రం నవంబర్ 27న విడుదల కాబోతోంది. ఈసారి అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా తనకు కలిసి రావాలని భాగ్యశ్రీ గట్టిగా నమ్ముకుంటోంది. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’తోనైనా విజయాన్ని అందుకుని, తనపై పడిన ‘ఐరన్ లెగ్’ ముద్రను చెరిపేసుకుని సక్సెస్ ట్రాక్‌లోకి వస్తుందో లేదో వేచి చూడాలి. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా విడుదలయ్యాక ఆమె కెరీర్ మలుపు తిరుగుతుందా అనేది ఇప్పుడు సినీ అభిమానుల ఆసక్తికర చర్చగా మారింది.

Exit mobile version