Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bethlehem Kudumba Unit: మలయాళ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో మరో సంచలనం నమోదైంది. నిన్నటివరకు మలయాళ చిత్రసీమలో ఆల్‌టైమ్ నంబర్ 1 ఇండస్ట్రీ హిట్‌గా ఉన్న ‘లోకా: చాప్టర్ 1 చంద్ర’ సాధించిన ₹301.5 కోట్ల వసూళ్లను ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ కేవలం 24 రోజుల్లోనే అధిగమించింది. దీంతో మలయాళ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నివిన్ పౌలీ, మమితా బైజుల రొమాంటిక్ కామెడీ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా కేవలం 24 రోజుల్లోనే ఈ మార్కును దాటడం విశేషం. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ.305 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. దీంతో మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్‌టైమ్ నంబర్ 1గా ఈ సినిమా నిలిచింది.
కేవలం 24 రోజుల్లోనే ఈ స్థాయికి చేరుకోవడం ఈ సినిమా బాక్సాఫీస్ రన్ ఎంత బలంగా ఉందో చూపిస్తోంది. సెప్టెంబర్ 13 నాటికి సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది. అదే సమయంలో ‘లోక’ జీవితకాల వసూళ్లను కూడా దాటేసింది. దీంతో మలయాళ సినీ వర్గాల్లో ఈ సినిమా విజయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేరళలో కూడా ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఇప్పటికే సరికొత్త రికార్డు నెలకొల్పింది. సెప్టెంబర్ 11 నాటికే ఈ సినిమా కేరళ బాక్సాఫీస్‌లో రూ.130 కోట్లకు పైగా వసూలు చేసినట్లు రిపోర్టులు వచ్చాయి. దీంతో అక్కడ కూడా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇంతకుముందు ‘వాజ్హా 2’ పేరిట ఉన్న కేరళ రికార్డును ఈ సినిమా అధిగమించింది.
Also Read
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
- Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
- Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
నివిన్ పాలీకి కూడా ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనదే. కొంతకాలంగా సరైన భారీ బాక్సాఫీస్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని అందించింది. ఈ సినిమా సక్సెస్‌తో ఆయన మళ్లీ మలయాళ ప్రేక్షకుల్లో తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకున్నారు. మమితా బైజుతో కలిసి నివిన్ పాలీ నటించిన ఈ రొమాంటిక్ కామెడీకి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్, మౌత్ టాక్ కారణంగా సినిమా రెండో వారం తర్వాత కూడా బలమైన వసూళ్లు సాధిస్తూ వచ్చింది. కొత్త సినిమాలు విడుదలైనప్పటికీ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ థియేటర్లలో తన జోరును కొనసాగించడం విశేషం.
ఇక రూ.305 కోట్ల మార్క్ దాటడంతో ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఇప్పుడు మలయాళ సినిమా మార్కెట్‌కు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి వసూళ్లు సాధించడం, ‘లోకా’ లాంటి సినిమాని కూడా అధిగమించడం నివిన్ పాలీ సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం మలయాళంలో నంబర్ 1 స్థానంలో ఉన్న ఈ సినిమా ఫైనల్ రన్ ముగిసేలోపు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?