బెంగళూరు హనుమంత నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునేశ్వర లేఅవుట్‌లో జరిగిన ఒక దారుణ సంఘటన కన్నడ టెలివిజన్ పరిశ్రమను కలవరపెట్టింది. ప్రముఖ టీవీ నటి, యాంకర్ అయిన మంజుల, (స్క్రీన్ నేమ్ శ్రుతి) భర్త అంబరీష్ చేతిలో కత్తిపోట్లకు గురైంది. జూలై 4న జరిగిన ఈ దాడి ఆలస్యంగా వెలుగులోకి రాగా, నిందితుడైన అంబరీష్‌ను పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
తలను గోడకు కొట్టి
జూలై 4న, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య, హనుమంత నగర్‌లోని వారి అద్దె ఇంటిలో ఈ దాడి జరిగింది. అంబరీష్ మొదట శ్రుతిపై పిప్పర్ స్ప్రే ఉపయోగించి, ఆమె కళ్లలో మంట పుట్టించి తర్వాత ఆమె పక్కటెముకలు, తొడ, మెడపై కత్తితో అనేకసార్లు పొడిచాడు. అంతేకాకుండా, ఆమె తలను గోడకు కొట్టి హత్యాయత్నం చేశాడు. శ్రుతి కేకలు విన్న పొరుగువారు వెంటనే జోక్యం చేసుకుని, అంబరీష్‌ను అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. శ్రుతిని వెంటనే విక్టోరియా ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమె చికిత్స పొంది ప్రస్తుతం కోలుకుంటోంది. ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది.
Also Read : SS Rajamouli: ఎక్కడకొచ్చి ఏం చేస్తున్నావ్?.. రాజమౌళి అసహనం!
దంపతుల మధ్య వివాదాలు
శ్రుతిగా ప్రసిద్ధి చెందిన ఈ మంజుల , కన్నడ సీరియల్ “అమృతధారే”తో సహా అనేక టెలివిజన్ సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆమె 20 సంవత్సరాల క్రితం అంబరీష్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, గత 15 సంవత్సరాలుగా వీరి వైవాహిక జీవితంలో అనేక సమస్యలు తలెత్తాయి. ఆర్థిక విషయాలు, శ్రుతి వ్యక్తిగత ఎంపికలు, అంబరీష్ ఆమె ప్రవర్తనపై అనుమానాలు ఈ గొడవలకు కారణాలుగా ఉన్నాయి.
మూడు నెలల క్రితం, శ్రుతి తన భర్తపై హనుమంత నగర్ పోలీస్ స్టేషన్‌లో హింస, ఆర్థిక వివాదాలపై ఫిర్యాదు చేసింది. ఈ వివాదాలలో ఇంటి అద్దె డబ్బులపై కూడా గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో, శ్రుతి తన సోదరుడి వద్దకు వెళ్లి ఉండడంతో జూలై 3న, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన చర్చల తర్వాత వీరు మళ్లీ కలిసి జీవించడానికి అంగీకరించారు. అయితే, ఈ రాజీ ఒక్క రోజు కూడా కొనసాగలేదు. మరుసటి రోజు, జూలై 4న, పిల్లలు కాలేజీకి వెళ్లిన సమయంలో అంబరీష్ ఈ దాడికి పాల్పడ్డాడు.
Also Read : Bihar Elections: షాకిస్తున్న ఓటర్ లిస్ట్! అందరూ వాళ్లే ఉన్నారు!
అంబరీష్ ఆరోపణలు
పోలీసు విచారణలో, అంబరీష్ తన భార్యపై పలు ఆరోపణలు చేశాడు. శ్రుతికి కుటుంబ బాధ్యతలు లేవని, ఆమె తన ఇద్దరు కుమార్తెలకు తల్లి ప్రేమను చూపించలేదని, ఎప్పుడుపడితే అప్పుడు పార్టీలు, పబ్‌లకు వెళ్లి ఇంటికి వచ్చేదని ఆరోపించాడు. ఇటీవల, శ్రుతి కుంభమేళాకు వెళ్లి 15 రోజులు ఇంటికి రాలేదని, ఈ విషయంపై గొడవ జరిగిందని చెప్పాడు. అంతేకాకుండా, శ్రుతి రూ.25 లక్షల విలువైన అపార్ట్‌మెంట్ అద్దె రద్దు చేసి డబ్బుతో వెళ్లిపోవాలని ప్లాన్ చేసిందని, ఈ విషయంపై గొడవ జరిగిన తర్వాత ఆమెపై దాడి చేశానని అంబరీష్ పోలీసులకు తెలిపాడు. హనుమంత నగర్ పోలీసులు అంబరీష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు.