ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. దీనికి కారణం ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు, సెలబ్రిటీలు.. బాధితులను ఆకర్షించడానికి బెట్టింగ్ యాప్‌లను పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తు మోసం చేస్తున్నారు. వీరి కారణంగా బెట్టింగ్ యాప్‌ల బారినపడుతున్న బాధితులు అప్పులపాలై ఆత్మహత్మలు చేసుకుంటున్నారు.
Also Read: Jyothika : ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు..
ఇక వారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వీరే అని పోలీసులు భావించి. వీటిని ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతు చౌదరి, టేస్టీ తేజ తో సహా 11 మంది నటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్‌లపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ కేసుపై ఫిల్మ్‌ఛాంబర్ స్పందించింది. సెలబ్రిటీలు హోదాను కాపాడుకోవాలి అని ప్రజలకు నష్టం కలిగే చర్యలను చేపట్టకూడదన్ని ఫిల్మ్‌ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ ‘మా’ నుంచి లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. యూట్యూబ్‌లో స్టార్స్ అయినంత మాత్రాన..రియల్ లైఫ్‌లో స్టార్స్ కాదన్నది గుర్తుంచుకోవాలి అని దామోదర ప్రసాద్ తెలిపారు.