ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు పెద్ద హీరో ఉన్నా, మంచి కథ లేకపోతే సినిమాను పట్టించుకోపోవడం లేదు. ఈ విషయంలో దర్శకులు చాలా భయంతో ముందడు వేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా ఇదే పరిస్థితి ఎదుర్కొంది. క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ, థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉండటం దర్శకుడు మోహన్ శ్రీవత్సకు తీవ్ర నిరాశ కలిగించింది.
Also Read : Kathanar : కథనార్ ఫస్ట్ లుక్ ఇంప్రెస్.. అనుష్క పాత్రపై హైప్ పెంచుతున్న ‘కథనార్’
దీనిపై మాట్లాడుతూ మోహన్ ఏడుస్తూ.. ‘థియేటర్‌కి వెళ్లాను. కేవలం పది మంది మాత్రమే ఉన్నారు. వారికి నేను దర్శకుడిని అని తెలియదు, కానీ వారు సినిమా బాగుందని హగ్ చేశారు. ఇలాంటి స్పందన చూసి ఆనందం కూడా కలిగింది, కానీ మిగతా ప్రేక్షకులు లేకపోవడం ఏంటో అర్థం కావడం లేదు. ఈ మూవీ కోసం రెండు ఏళ్ల పాటు కుక్కల కష్టపడి తెరకెక్కించారు. ఎవ్వరు రాలేదు. నా భార్య కూడా సినిమా మధ్యలో.. నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానో అని తను వచ్చేసింది. సినిమా నచ్చకపోతే నా చెప్పుతో నేను కొట్టుకుంటా అని సవాల్ చేసాను. కానీ ఇప్పుడు ప్రేక్షకులే రావడం లేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన చెప్పుతో తాను కొట్టుకున్నారు.. అలాగే
‘నిజమే తెలుగు ప్రేక్షకులు పరభాషా సినిమాలకే ఆదరణ చూపిస్తున్నారు. ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీకి వెళ్లాలని ఉంది. అక్కడ సినిమా తీసి, తెలుగోడి సినిమా అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను’ అని తన బాధను వ్యక్తం చేశారు మోహన్. ‘సినిమా నచ్చకపోతే ఓకే, తిడితే ఓకే, కానీ అసలు చూడకుండా విమర్శిస్తే ఎంత బాధగా ఉంటుంది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో విడుదల చేయగా, ఇది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
#Barbarik ఓ దర్శకుడి ఆవేదన pic.twitter.com/4O7C2tbMTE
— devipriya (@sairaaj44) August 31, 2025