NTV Telugu Site icon

Balayya: ఆ బ్లాక్ బస్టర్ రీమేక్ లో నటించనున్న బాలయ్య.. సెట్ అవుతుందా..?

Untitled Design (74)

Untitled Design (74)

ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలలో జోరు మీద హీరో అంటే నందమూరి బాలకృష్ణ. అఖండ సినిమాకు ముందు బాలయ్య వేరు ఆ తర్వాత వేరు. వరుస సినిమాలు ఒకదానికొకటి సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు బాలయ్య. ఆహాలో ప్రసారమైన అన్‌స్టాపబుల్‌ ఈ హీరో ఇమేజ్ ను మార్చేసి ఎక్కడికో తీసుకువెళ్లింది. చిన్న, పెద్ద తేడా లేకుండా బాలయ్య సినిమాలు చూసేవారి సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘వీరమాస్’ సినిమాలో నటిస్తున్నాడు బాలా.

Also Read: Sudheer Babu: సుధీర్ బాబు కూడా ఊహించని విజయం.. కారణం ఏంటి.?

తాజగా టాలివుడ్ లో ఓ న్యూస్ గట్టిగా వినిపిస్తోంది. బాలా హీరోగా ఓ సినిమా రీమేక్ చేస్తున్నారు అన్నది ఆ న్యూస్ సారాంశం. ఇటీవల మలయాళంలో ఫహద్ ఫాసిల్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఆవేశం’. ఎటువంటి హైప్ లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించి, రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమాను బాలయ్యతో రీమేక్ చేయాలని మైత్రీ మూవీస్ రీమేక్ రైట్స్ కొనుగోలు చేసారు. ఈ రీమేక్ భాద్యతలను దర్శకుడు హరీష్ శంకర్ కు అప్పగించనున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో బాలా రీమేక్‌ల జోలికి వెళ్లలేదు. గత 20ఏళ్లలో రీమేక్ లకు బాలయ్య దూరంగా ఉంటూ వచ్చారు. చివరగా బాలకృష్ణ నటించిన రీమేక్ సినిమా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన `లక్ష్మీ నరసింహ`. ఆ సినిమా సూపర్ హిట్ సాధించింది. అయితే ఆవేశం రీమేక్ లో బాలయ్య నటిస్తే చాలా బాగుంటుందని ఇండస్ట్రీ సర్కిల్స్ విపిస్తోంది. కానీ బాలా ఇంకా ఆవేశం సినిమా చూడలేదని, ఆ సినిమా చూసాక అది బాలయ్యకు నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందనడంలో రెండో మాటే లేదు.

Show comments