Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna vs Nagarjuna: టాలీవుడ్లో సీనియర్ హీరోల సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పుడు మరోసారి అలాంటి ఆసక్తికరమైన క్లాష్‌కు రంగం సిద్ధమవుతోంది. దాదాపు 22 ఏళ్ల క్రితం క్రిస్మస్ సీజన్లో పోటీ పడిన బాలకృష్ణ, నాగార్జున.. ఇప్పుడు మరోసారి అదే పండగ సీజన్లో తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో 2004 బాక్సాఫీస్ లెక్కలు 2026లోనూ రిపీట్ అవుతాయా? అనే చర్చ మొదలైంది. 2004 క్రిస్మస్ సీజన్లో బాలకృష్ణ ‘విజయేంద్ర వర్మ’, నాగార్జున ‘మాస్’ సినిమాలు పోటీ పడ్డాయి. ఆ క్లాష్‌లో నాగార్జున నటించిన ‘మాస్’ విన్నర్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ 22 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు సీనియర్ హీరోలు క్రిస్మస్ బరిలోకి దిగుతుండటంతో అప్పటి రిజల్ట్ మరోసారి గుర్తుకొస్తోంది.
బాలకృష్ణ ‘దాదా’ అనే మాస్ టైటిల్‌తో డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్, మంచు మనోజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు ఉన్న మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్. అయితే ఇప్పటికే వీరి కాంబినేషన్లో ‘వీరసింహారెడ్డి’ వంటి మాస్ సినిమా రావడంతో.. మరోసారి అదే జోన్లో బాలయ్యను చూడటానికి అభిమానులు ఎంతవరకు కనెక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సాధారణ ప్రేక్షకులను సినిమా ఏ స్థాయిలో థియేటర్లకు రప్పిస్తుందన్నదే కీలకం. మరోవైపు నాగార్జున తన కెరీర్లో 100వ సినిమాగా ‘కింగ్ 100’తో బరిలోకి దిగుతున్నారు. డిసెంబర్ 24నే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ నాగార్జునకు ప్రత్యేకంగా మారింది. కెరీర్లో ఒక మైలురాయిగా నిలవాల్సిన సినిమా కావడంతో అంచనాలతో పాటు ఒత్తిడి కూడా ఉంది.
Also Read
బాలయ్యకు బలమైన మాస్ ఫ్యాన్ బేస్ ఉండగా.. నాగార్జునకు క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. దీంతో ఇద్దరు హీరోలకు తమదైన బలాలు ఉన్నాయి. అదే సమయంలో క్రిస్మస్ సీజన్లో షోలు, థియేటర్లు, ప్రేక్షకుల ఎంపిక విషయంలో పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఇక ఇదే సీజన్‌ను బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కూడా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో క్రిస్మస్ బాక్సాఫీస్ మరింత ఆసక్తికరంగా మారనుంది. అయితే హైప్లో ఎవరు ముందున్నారు అనేది కంటే.. మొదటి షో తర్వాత ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందన్నదే అసలు గేమ్‌ను మార్చే అంశం. కంటెంట్ క్లిక్ అయితే స్టార్ ఇమేజ్‌కు మరింత బలం చేకూరుతుంది. లేదంటే భారీ అంచనాలు కూడా కలెక్షన్లను కాపాడలేకపోవచ్చు. ఒకవైపు ‘దాదా’గా బాలయ్య మాస్ పవర్ చూపించబోతుంటే.. మరోవైపు ‘కింగ్ 100’తో నాగార్జున సెంటిమెంట్‌తో వస్తున్నారు. 22 ఏళ్ల క్రితం క్రిస్మస్ పోటీలో నాగ్ పైచేయి సాధించగా.. ఈసారి ఆ లెక్కను బాలయ్య మారుస్తారా? లేక నాగార్జున మరోసారి అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్‌ను కొల్లగొట్టి సీనియర్ హీరోల సత్తా చాటుతాయా అనేది చూడాలి.
తాజావార్తలు
-
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
-
Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
-
Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
-
Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
-
Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!