Dada: రక్తపాతం లేని రచ్చ.. బాలయ్య వర్సెస్ మనోజ్ ‘దాదా’ వార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dada: నందమూరి బాలకృష్ణ మాస్ సినిమా అంటేనే తెరపై బాంబులు, గాల్లోకి లేచే సుమోలు, రక్తపాతం సృష్టించే భారీ ఫైట్లు గుర్తుకొస్తాయి. కానీ ఈ రెగ్యులర్ ఫార్ములాకు పూర్తి భిన్నంగా, సరికొత్త ప్రయోగంతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు గాడ్ ఆఫ్ మాస్. ఆయన నటిస్తున్న తాజా క్రేజీ చిత్రం ‘దాదా’ లో రక్తపాతం లేని ఒక మైండ్ బ్లోయింగ్ వార్ తెరకెక్కుతున్నట్లు వచ్చిన వార్త ప్రస్తుతం టాలీవుడ్‌ను ఊపేస్తోంది. రాకింగ్ స్టార్ మంచు మనోజ్, బాలయ్య మధ్య నడిచే ఫేస్-ఆఫ్ సీక్వెన్స్‌లో ఎలాంటి రక్తపాతం ఉండదని, కేవలం మాటలతోనే ఊచకోత కోసేలా ఈ ఘట్టాలను డైరెక్టర్ గోపిచంద్ మలినేని తీర్చిదిద్దారని తెలుస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సాధారణంగా బాలకృష్ణ సినిమాల్లో కనిపించే శృతిమించిన స్టంట్స్, విలన్లను గాల్లోకి ఎగరేసే సాధారణ ఫైట్లకు బదులు.. ఇద్దరు బలమైన నటుల మధ్య జరిగే పదునైన సంభాషణలకే దర్శకుడు పెద్దపీట వేసినట్లు చెబుతున్నారు. బాలయ్య గంభీరమైన స్వరం, ఆయన విసిరే పవర్ ప్యాక్డ్ డైలాగ్స్‌కు ధీటుగా మంచు మనోజ్ ఇచ్చే కౌంటర్లు థియేటర్లలో సీట్ల అంచున కూర్చోబెట్టేలా ఉంటాయని సమాచారం. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా.. కేవలం సంభాషణలతోనే హై-వోల్టేజ్ టెన్షన్ క్రియేట్ చేయడం ఈ సీన్ల ప్రత్యేకత అని ఇండస్ట్రీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. బాలకృష్ణ తిరుగులేని మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, దానికి తోడు మంచు మనోజ్ చూపించే రా ఎనర్జీ ఒకే ఫ్రేమ్‌లో పడితేనే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అలాంటిది వీరిద్దరి మధ్య సాగే ఈ మాటల విస్ఫోటనం ప్రేక్షకులకు సరికొత్త గూస్బంప్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు మేకర్స్ నుంచి దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు.
Also Read
తాజావార్తలు
-
Dada: రక్తపాతం లేని రచ్చ.. బాలయ్య వర్సెస్ మనోజ్ ‘దాదా’ వార్!
-
Team India: టీమిండియా జట్టులోకి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. కెప్టెన్‌గా తిలక్ వర్మ..
-
Sivakarthikeyan: డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. సర్ప్రైజ్ మామూలుగా లేదుగా!
-
Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
-
School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!