నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కూడా ప్రకటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా కొనసాగింపుగా అఖండ సీక్వెల్ సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అంతేకాదు ఈ సినిమా కోసం వేసిన స్పెషల్ సెట్లో ఈ సినిమాకు సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ కూడా జరిగింది. రామోజీ ఫిలిం సిటీ లో ఏర్పాటు చేసిన స్పెషల్ సెట్ లో నందమూరి బాలకృష్ణ ఇంట్రడక్షన్ ఫైట్ నందమూరి అభిమానులు అందరినీ అలరించేలా ప్లాన్ చేశారు. ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ ఇద్దరూ కలిసి 12 రోజులు పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఇక కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత అఖండ 2 కొత్త షెడ్యూల్ ప్రారంభమైందని, ప్రస్తుతానికి టాకీ పాట షూట్ చేస్తున్నారని తెలుస్తోంది.
Rave Party: తూర్పు గోదావరిలో రేవ్ పార్టీ కలకలం.. ఐదుగురు యువతుల సహా…
ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే ఫోర్త్ సీజన్లో బిజీగా ఉన్నారు. వరుస సినిమాలు ఉండడంతో ఆ ప్రమోషనల్ ఎపిసోడ్స్ తో ఆయన బిజీబిజీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అఖండ 2 సెట్స్ నుంచి అన్ స్టాపబుల్ సెట్స్, అక్కడ నుంచి మళ్లీ అఖండ 2 సెట్స్, ఇలా షటిల్ సర్వీస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.. ఇంకా విలన్ కోసం బోయపాటి శ్రీను సెర్చ్ చేస్తున్నారు బాలకృష్ణ కు సరైన ప్రత్యర్థిని ఆయన రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు.. బాలీవుడ్ నుంచే ఎవరో ఒకరిని రంగంలోకి దింపే అవకాశం ఉంది. మరో పక్క ఈ సినిమాలో హీరోయిన్గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. అఖండ సెకండ్ పార్ట్ కి కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాకి నిర్మాతలు కాగా బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాని సమర్పిస్తున్నారు. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.