NBK 109: బాలయ్య కోసం గోపీచంద్ మలినేని ప్లానింగ్ అదిరిపోయిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘NBK109’ (వర్కింగ్ టైటిల్). ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇటీవలే విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్లో బాలయ్య బాబును ఒక పవర్ఫుల్ ‘రాజు’ గెటప్‌లో చూపించి మేకర్స్ అందరికీ మైండ్ బ్లోయింగ్ షాక్ ఇవ్వగా. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా, తాజా సమాచారం ప్రకారం త్వరలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలోని ఒక అత్యంత కీలకమైన పీరియాడిక్ యుద్ధ సన్నివేశం కోసం మేకర్స్ భారీ ప్లాన్ చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఒక పురాతన కోట యుద్ధ భూమికి సంబంధించిన భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్లోనే బాలకృష్ణ ఇతర ప్రధాన నటీనటులపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక భారీ విజువల్స్ తో కూడిన యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. ఈ వార్ సీక్వెన్స్‌లో బాలయ్య బాబు హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, గెటప్ ప్రతీ ఒక్క నందమూరి అభిమానికి పూనకాలు తెప్పించేలా, అత్యంత థ్రిల్లింగ్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Karthi: "డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?" విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
- Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
- OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
- Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. 'ది ప్యారడైజ్'లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
ఇక బాలయ్య సినిమాలకు తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లను షేక్ చేసే మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ (S.S. Thaman) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే థమన్ ఈ సినిమా కోసం రెండు అదిరిపోయే మాస్ ట్యూన్స్‌ను కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ పీరియాడిక్ వండర్ థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?