Vanangaan Trailer : అదరగొట్టిన బాలా.. ట్రైలర్..భళా..
- 18ఏళ్ల తర్వాత సూర్యతో సినిమా
- పేక్షకులను ఆకట్టుకొన్న వణంగాన్ ట్రైలర్
- సహజత్వానికి మారు పేరు
బాలా ఈ దర్శకుడు పేరు ఒకప్పుడు అటు తమిళ్ ఇటు తెలుగు పరిశ్రమల్లో బాగా వినిపించేది. యదార్ధ సంఘటనలు, రియలిస్టిక్ నేపథ్యం ఉండే చిత్రాలు బాలా తెరకెక్కించినట్టు మరెవరు తీసేవారు కాదేమో. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఎదురు చూసేవారు. బాలా చిత్రాలు తెలుగులోనూ సూపర్ హిట్ సాదించాయి. శివపుత్రుడు, వాడే – వీడు చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ దక్కించుకున్నాయి.
తన కెరీర్ ప్రారంభంలో తనకు శివపుత్రుడు లాంటి హిట్ సినిమా ఇచ్చిన బాలాకు 18 ఏళ్ల తర్వాత మరోసారి ఆయన దర్శకత్వంలో అచలుడు అనే చిత్రాన్ని ప్రారంభించాడు సూర్య . సగభాగం షూటింగ్ చేసాక సూర్య, బాలాకు మధ్య విభేదాల కారణంగా ఆ చిత్రాన్ని ఆపేస్తునట్టు ప్రకటించాడు. ఆ వెంటనే అరుణ్ విజయ్ హీరోగా వణంగాన్ అనే చిత్రాన్నిమొదలెట్టాడు బాలా.
Also Read
వణంగాన్ చిత్రంలో అరుణ్ ఫస్ట్ లుక్ తో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. ఇటీవల వణంగాన్ ట్రైలర్ విడుదల చేసింది నిర్మాణ సంస్థ. ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ట్రైలర్ చుసిన ప్రతి ఒక్కరు బాలాకు ఇది కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని కొనియాడారు. కన్యాకుమారి సముద్ర తీరంలోని తిరువళ్లువర్ విగ్రహ విశ్వరూపంతో టీజర్ స్టార్ట్ చేసి , దేవాలయం వెనుకవైపు బైక్‌పై నుదుట విభూది, కుంకుమతో అరుణ్ విజయ్ కనిపిస్తున్నారు. బావిలో నుంచి ఓ చేతితో పెరియార్, మరో చేతిలో వినాయకుడితో అరుణ్ విజయ్ పైకి వచ్చే సీన్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది.
కాగా గతంలో అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ చేసేందుకు విక్రమ్ కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ సినిమా ప్రారంభించాడు బాలా. షూటింగ్ పూర్తయ్యాక రష్ చుసిన విక్రమ్ సంతృప్తి చెందక బాలను తప్పించి మరోక దర్శకుడిని తీసుకున్నారు. దాంతో ఎలాగైనా హిట్ సినిమా చేయలని వణంగాన్ చిత్రాన్ని తెరకెక్కించాడు బాలా. ఈ చిత్రంతో కమ్ బ్యాక్ ఇస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ చిత్రం ఏ మేరకు అలరిస్తుందో, బాలాకు హిట్ దక్కుతుందో లేదో చూడాలి. ఈలోపు మీరూ వణంగాన్ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?