దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా కీలక పాత్రలలో నటించిన చిత్రం బాహుబలి. ఈ సినిమాకి సంబంధించిన మొదటి భాగం 2015లో రిలీజ్ అయి సూపర్ హిట్ అందుకోగా, రెండో భాగం 2017లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా మొదటి భాగం రిలీజ్ అయి మొన్నటికి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో, ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీన రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో సినిమా రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తోంది.
Also Read:Baahubali : బాహుబలి రన్ టైమ్ పై రానా క్లారిటీ..
అందులో భాగంగానే ఇప్పటికే ప్రమోషన్స్ సోషల్ మీడియాలో మొదలుపెట్టారు. అయితే, బాహుబలి అనే పేరుతో ఉన్న సినిమాకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ మాత్రం చాలా యాక్టివ్‌గా సిద్ధమైంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం “ఒకవేళ బాహుబలిని కట్టప్ప చంపకపోతే” అనే ప్రశ్న వేయగా, దానికి నెటిజన్లు ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు.
Also Read:War 2: వార్ 2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. ఎన్టీఆర్ లుక్ అదుర్స్
ఒక నెటిజన్ “బాహుబలిని కట్టప్ప చంపకపోతే, రాజమాత దేవసేన ప్రతిరోజు జుట్టును పట్టుకుని కొట్టుకునేవారు” అని సమాధానం ఇవ్వగా, మరొక నెటిజన్ మాత్రం “బాహుబలిని అప్పుడు రాజమాతే చంపి ఉండేది” అని కామెంట్ చేశారు. ఇక ఇంకొక నెటిజన్ “బాహుబలి 2 అప్పుడు 1800 కోట్లు కలెక్ట్ చేయగలిగేది కాదు” అని కామెంట్ చేశారు. ఇంకొక నెటిజన్ “అతను మళ్లీ రాజుగా సింహాసనం అధిష్ఠించేవాడు” అని చెప్పుకొచ్చారు.
