Site icon NTV Telugu

Thama Teaser : ఆయుష్మాన్ ‘థామా’ టీజర్.. రష్మిక రెచ్చిపోయిందిగా..

Rashmika

Rashmika

ఆయుష్మాన్ ఖురానా , రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం థామా.  మాఢాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం లో వస్తున్న సినిమా, దినేష్ విజన్ హర్రర్ యూనివర్స్‌లో మొట్టమొదటి రొమాంటిక్ కామెడీగా అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వీడియో విడుదలై, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక కొద్ది సేపటి క్రితం ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

టీజర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రష్మిక మందన్న గురించి. యాక్షన్ సన్నివేశాలలో రష్మిక అదరగొట్టింది. అలాగే రొమాంటిక్ సన్నివేశాలలో కూడా రష్మిక మెప్పించింది. టీజర్ స్టార్టింగ్ లో వచ్చే రష్మీక క్లోజ్ అప్ షార్ట్ అయితే టీజర్ కే హైలెట్. చివరలో లిప్ లాక్ తో టీజర్ కు గ్లామర్ పెంచింది. ఇక టీజర్ లో నవాజుద్దీన్ సిద్ధికి చివర్లలో తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. దినేష్ విజన్, మాడ్డాక్ ఫిల్మ్స్ హర్రర్ యూనివర్స్ ఇప్పటికే బాలీవుడ్‌లో పెద్ద బ్రాండ్‌గా నిలిచింది. ఈ యూనివర్స్‌లో స్త్రీ, ముంజ్యా లాంటి సూపర్ హిట్స్, స్త్రీ 2 కి వచ్చిన సక్సెస్, అలాగే భేడియా డిజాస్టర్ అయినప్పటికీ ఇప్పుడు థామా పైన ఆడియన్స్‌లో క్యూసిటీ తగ్గలేదు చెప్పాలంటే పీక్‌లో ఉంది, ఇది హర్రర్ యూనివర్స్‌లో ఫస్ట్ రొమాంటిక్ కామెడీ. థామా తర్వాత, మాడ్డాక్ ఫిల్మ్స్ భారీ లైనప్ రెడీ చేసింది. ఈ లిస్ట్‌లో శక్తి శాలిని, భేడియా 2, చాముండా, స్త్రీ 3, అలాగే మహాముంజ్యా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులతో, మాఢాక్ ఫిల్మ్స్ హర్రర్ యూనివర్స్ బాలీవుడ్‌లో అతిపెద్ద కనెక్టెడ్ ఫ్రాంచైజ్‌గా రికార్డ్ సెట్ చేయబోతోందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

Exit mobile version