Site icon NTV Telugu

Atharvaa: నాన్న మరణం.. చాలా భయానకం.. హీరో కీలక వ్యాఖ్యలు

Athrva

Athrva

నటుడు అథర్వ నటించిన కొత్త సినిమా DNA జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అథర్వ సరసన నిమిషా సజయన్ నటిస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అథర్వ తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడారు. అథర్వ తన తండ్రి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

Also Read:Kajol: రామోజీ ఫిలిం సిటీ ‘దెయ్యాల ఆవాసం’.. స్టార్ హీరోయిన్ సంచలనం!

“నా మొదటి సినిమా విడుదలైన కొద్ది రోజులకే, అంటే పది రోజుల్లోనే నాన్న మరణించారు. అప్పటి వరకు నేను ప్రతి నిర్ణయం నాన్నతో చర్చించిన తర్వాతే తీసుకునేవాడిని. ఆయన లేకపోవడం నన్ను చాలా కలవరపెట్టింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించలేని స్థితిలో ఉండేవాడిని. ప్రతి సినిమా షూటింగ్ పూర్తయ్యాక, ‘ఇది విడుదల అవుతుందా? ఎలా ఆడుతుంది?’ అనే ఆందోళన మనసులో ఉండేది. ఇది మానసికంగా నన్ను చాలా బాధపెట్టింది.” అని అన్నారు. ఇక అథర్వ తండ్రి, ప్రముఖ నటుడు మురళి, 46 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ ఘటన తర్వాత అథర్వ జీవితం పట్ల భయపడ్డాడా అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన మాట్లాడుతూ “జీవితం ఎవరూ ఊహించనటువంటిది, నాన్న మరణం నాకు చాలా భయాన్ని కలిగించింది, అది నిజం. కానీ నేను బతికినంత కాలం సంతోషంగా ఉండాలనుకుంటా. ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా, మంచిగా ఉండాలని కోరుకుంటా, ఎప్పుడూ నా అమ్మకు ఇష్టమైన కొడుకుగా ఉండాలని అనుకుంటా.” అని అన్నారు.

Also Read:Kodali Nani: కొడాలి నాని అరెస్ట్‌పై క్లారిటీ ఇచ్చిన పోలీసులు..

ఇక తన రాబోయే సినిమా పరాశక్తి గురించి మాట్లాడుతూ “సుధా కొంగర గారికి పరదేశి సినిమా సమయంలోనే పరిచయం అయ్యాను. ఆ సినిమాలో ఆమె బాలా సర్‌తో కలిసి పని చేశారు. అప్పుడు కూడా ఆమె సెట్‌లో అందరినీ అద్భుతంగా కంట్రోల్ చేసేవారు. 500 మంది ఉన్న షూటింగ్ స్పాట్‌లో కూడా ఆమె పూర్తి కంట్రోల్ లో ఉండేది. పరాశక్తి సినిమా65 శాతం పూర్తయింది. పొంగల్‌కి విడుదల అవుతుందా అనేది ఇంకా ఖచ్చితంగా తెలియదు, కానీ సినిమా అద్భుతంగా వస్తోంది.” అని చెప్పుకొచ్చారు.

Exit mobile version