AS : ‘ఏషియన్ సినిమాస్’ లో వాటాకు బాలీవుడ్ సంస్థ ప్రయత్నాలు..?
- నైజాం లో కింగ్ మేకర్ గా ఏషియన్ సినిమాస్
- ఏషియాన్ సురేష్ గా సినిమాలు పంపిణీ
- ఏషియన్ లో వాటా కొనుగోలుకు బాలీవుడ్ ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో అతి పెద్దదైన సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో ఏషియన్ సినిమా ముందు వరసలో ఉంటుంది. మరి ముఖ్యంగా నైజాం లో ఏషియన్ సినిమాస్ పేరిట భారీ సినిమా థియేటర్స్ చైన్ ఉంది. హైదరాబాద్ లోని మెజారిటీ స్క్రీన్స్ అన్ని ఏషియన్ సినిమాస్ పేరుతోనే ఉంటాయి. మల్టిప్లెక్స్ లోను ఏషియన్ సినిమాస్ స్క్రీన్స్ కలిగి ఉంది. నారాయణదాస్ కె. నారంగ్ మరియు ఏషియన్ సునీల్ ప్రపంచ స్థాయి సినిమా వీక్షణ అనుభూతిని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ వెంచర్‌ను ప్రారంభించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు AMB,అల్లు అర్జున్ AAA మల్టీప్లెక్స్ లో కూడా ఏషియన్ సినిమాస్ వాటా కలిగి ఉంది.
Also Read : SK : ‘అమరన్’ మేజర్ ముకుంద్ కు ఘనమైన నివాళి..
Also Read
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, భద్రాచలం, సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాలలో 8 మల్టీప్లెక్స్‌లు, 12 సినీప్లెక్స్‌లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 80 సింగిల్ స్క్రీన్‌లు, మొత్తం 98,000 మంది సీటింగ్‌లు ఉన్నాయి. కాగా ఇప్పుడు ఏషియన్ సినిమాస్ కు భారీ డీల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఏషియన్ గ్రూప్ లో కొంత వాటాను తీసుకునేందుకు ఓ బాలీవుడ్ కంపెనీ ప్రయత్నాలు చేస్తోందని ఇటీవల అందుకు సంబంధించి చర్చలు మొదలయ్యాయని సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగి ఈ డీల్ కనుక కుదిరితే భారీ ధరకు ఏషియన్ సినిమాస్ లో కొంత వాటా బాలీవుడ్ కంపెనీ వశమవుతుంది. అలాగే మరిన్ని సింగిల్ స్క్రీన్స్ ను లీజ్ కు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఏషియన్ సినిమాస్ ఇటు థియేటర్స్ మాత్రమే కాకుండా సినిమా డిస్టిబ్యూషన్, ప్రొడక్షన్ లోను ఏషియన్ సినిమాస్ అగ్రగామిగా ఉంది.
తాజావార్తలు
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!