పాత రోజుల్లో ఇతర భాషల్లో హిట్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలను రీమేక్ పేరుతో మక్కికి మక్కి దింపేసి హిట్ కొట్టేవాళ్లు. అలాగే ఎక్కడో చుసిన హాలీవుడ్, ఫ్రెంచ్ సినిమాలలోని సీన్స్ నుండి ఇన్స్పైర్ అయి వాటిని మన తెలుగు సినిమాలలో వాడుకునేవారు. డిజిటల్ లేని రోజుల్లో ఇవి కుదిరింది కానీ ఇప్పుడు ఎవరైనా దర్శకుడు ఏదైనా సీన్ లేదా సాంగ్ లోని చిన్న ట్యూన్ కాపీ కొట్టినా సరే ఇట్టే పెట్టేస్తున్నారు నెటిజన్స్. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఖలేజాలోని కొన్ని సీన్స్ ను జిరాక్స్ దింపేసాడని ఒరిజినల్ సీన్స్ ను కూడా బయటపెట్టారు నెటిజన్స్.
Also Read : Kaanta : సముద్రఖని ‘కాంత’ ఫస్ట్ లుక్ రిలీజ్
కానీ ఇప్పుడు లేటెస్ట్ గా మరో బ్లాక్ బస్టర్ సినిమాకు సంబంధించి సీన్స్ ను ఒరిజినల్ నుండి కాపీ చేసారని పసిగట్టారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ఎలాంటి సంచలనం చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలోని ‘ఏమి మాట్లాడుతున్నావ్ రా అని ఫోన్ లో వార్నింగ్ ఇచ్చి తన గర్ల్ ఫ్రెండ్ పై రంగాల చల్లిన వాటిని చితకొట్టే సీన్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ సీన్ మొత్తాన్ని హాలీవుడ్ లో 1995 లో మార్టిన్ స్కోరెస్ దర్శకత్వంలో వచ్చిన అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ చలనచిత్రం ‘గుడ్ ఫెల్లాస్’ నుండి జిరాక్స్ కాపీ చేసాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడు ఈ విషయాన్నీ కనిపెట్టిన నెజిజన్స్ అదేంటీ వంగా నువ్వు కూడా కాపీ చేసావా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన కాపీ కొట్టలేదు తస్కరించాడని వంగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు
#ArjunReddypic.twitter.com/uzmWrOJgiE
— TollywoodHub (@tollywoodhub8) April 26, 2025
