Arjun Kapoor : మలైకాతో బ్రేకప్ తర్వాత పదేళ్ల చిన్నదైన ఆ బ్యూటీతో అర్జున్ కపూర్ కొత్త లవ్ ట్రాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లో ప్రేమ, బ్రేకప్ వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. మలైకా అరోరాతో బంధానికి ఫుల్స్టాప్ పెట్టిన తర్వాత, హీరో అర్జున్ కపూర్ పర్సనల్ లైఫ్ మళ్లీ ఇప్పుడు బీ-టౌన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనకంటే పదేళ్లు చిన్నదైన నటి, స్పోర్ట్స్ ప్రెజెంటర్ సాహిబా బాలితో అర్జున్ డేటింగ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇంతకాలం కేవలం గాసిప్స్‌కే పరిమితమైన వీరిద్దరి వ్యవహారం, తాజాగా గురుపురబ్ సందర్భంగా సాహిబా పెట్టిన ఒకే ఒక్క పోస్ట్‌తో ఒక్కసారిగా వేడెక్కింది. గురుపురబ్ వేడుకల సందర్భంగా సాహిబా బాలి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అర్జున్ కపూర్‌తో కలిసి దిగిన ఒక ఫొటోను పంచుకుంది. ఫొటోలో ఇద్దరూ ఎంతో క్లోజ్‌గా, నవ్వుతూ పోజులిచ్చారు. అయితే, నెటిజన్ల కళ్లన్నీ ఫొటో కంటే కూడా సాహిబా రాసిన క్యాప్షన్ మీదే పడ్డాయి. “అతని ప్రసాదంలో సగం నేనే తినేశా.. హ్యాపీ గురుపురబ్” అంటూ ఆమె రాసిన సరదా క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా స్నేహితుల మధ్య ఉండే చనువు కంటే ఇది కాస్త ఎక్కువేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫొటో క్షణాల్లో రెడిట్ లోకి చేరి పెద్ద చర్చకే దారితీసింది.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “సాహిబా గురించి గతంలో చాలా డేటింగ్ వార్తలు వచ్చాయి కానీ, ఈ ఫొటో చూస్తుంటే మాత్రం ఇదేదో తమ రిలేషన్‌షిప్‌ను ‘సాఫ్ట్ లాంచ్’ చేసినట్లుగా ఉంది” అని ఒకరు కామెంట్ చేయగా, “అతని ప్రసాదంలో సగం తినేసిందంటే.. ఇంకేం కావాలి, వీళ్లిద్దరూ పక్కా డేటింగ్లో ఉన్నారు” అంటూ మరొకరు సెటైర్లు వేస్తున్నారు. అర్జున్, సాహిబా పేర్లు ఇలా జతకట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో లండన్‌లోని ప్రసిద్ధ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన భారత్-ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి సందడి చేశారు. అప్పుడే వీరి మధ్య ఏదో ఉందన్న ప్రచారం మొదలైంది. మరోవైపు, సాహిబా పేరు గతంలో ప్రముఖ కమెడియన్లు కుల్లు, సమయ్ రైనాలతో కూడా వినిపించింది. కానీ ఆ వార్తలపై ఆమె ఎప్పుడూ స్పందించలేదు. మరి ఇప్పుడు అర్జున్ కపూర్‌తో కలిసి పెట్టిన ఈ ‘గురుపురబ్’ పోస్ట్ కేవలం స్నేహపూర్వకమైనదా? లేక నిజంగానే బాలీవుడ్‌కు మరో కొత్త జంట దొరికిందా? అన్నది తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు పెదవి విప్పాల్సిందే!
Also Read
- Nikhil Siddhartha: తెలుగు సినిమాల్లో ఆ చెత్త ఆగిపోవాలి
- Sampath Nandi: ఆ ఒక్క కారణంతోనే పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకున్నా..
- Mega Box Office Clash: 'కాకా' కర్చీఫ్ వేసిన చోటే 'విశ్వంభర' కన్ను.. సంక్రాంతి బరిలో మెగా క్లాష్?
- Sreejith Ravi : బాలికలతో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసులో ప్రముఖ విలన్‌కు షాక్
తాజావార్తలు
-
Arjun Kapoor : మలైకాతో బ్రేకప్ తర్వాత పదేళ్ల చిన్నదైన ఆ బ్యూటీతో అర్జున్ కపూర్ కొత్త లవ్ ట్రాక్?
-
AP Rain Alert: ఏపీకి వర్ష సూచన.. రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వానలు.. అలర్ట్ జారీ
-
Nikhil Siddhartha: తెలుగు సినిమాల్లో ఆ చెత్త ఆగిపోవాలి
-
ICC Rankings: న్యూజిలాండ్‌పై అదరగొట్టిన బుమ్రా.. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారీ జంప్..
-
Central Cabinet: కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. ఆ రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!