విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్, సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఆద్యంతం ఆకట్టుకున్న ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. అర్జున్ చక్రవర్తి కేవలం సినిమా మాత్రమే కాదు నా తొమ్మిది సంవత్సరాల కల. మా టీమ్ అంతా ఆరేళ్లపాటు హార్డ్ వర్క్ చేశారు. మా నిర్మాతగా ఇచ్చిన సపోర్ట్ ని మర్చిపోలేను. ఆయన నాపై పూర్తి విశ్వాసం ఉంచారు. ఒక డెబ్యు డైరెక్టర్ కి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇచ్చారు. ఒక దైవంలాగా వచ్చారు. హీరో విజయ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడు. చాలా రిస్కులు తీసుకున్నాడు. అర్జున్ చక్రవర్తిగా కనిపించడానికి 100% ఎఫర్ట్ పెట్టాడు. మైనస్ డిగ్రీల్లో షర్టు లేకుండా నటించాడు. ఈ సినిమాలో పనిచేసిన అందరూ కూడా చాలా డెడికేషన్ తో చేశారు. ఇందులో హీరో గారి క్యారెక్టర్ తో పాటు దయా క్యారెక్టర్ కూడా ఫిజికల్ గా ట్రాన్స్ఫర్మేషన్ వుంది. డిఓపి జగదీష్ అద్భుతమైన విజువల్స్ అందించారు. మా మ్యూజిక్ బ్రిలియంట్ ఔట్పుట్ ఇచ్చారు. సిజ దేవిక పాత్రలో ఒదిగిపోయింది. అజయ్ గారు మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది.