Site icon NTV Telugu

Ari : ఆకట్టుకున్న షడ్వర్గాల కాన్సెప్ట్!

Ari Movie

Ari Movie

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో డివైన్ ట్రెండ్‌ నడుస్తోంది. ‘కార్తికేయ 2’, ‘కాంతార’, ‘హనుమాన్’, ‘మిరాయ్’, ‘కాంతార చాప్టర్ 1’ వంటి చిత్రాలన్నీ కూడా మైథలాజికల్ టచ్‌తో కూడిన డివైన్ వైబ్స్‌ను అందించి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ, ‘అరి’ అనే చిత్రం ఒక సరికొత్త మైథలాజికల్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పేపర్ బాయ్’ దర్శకుడు జయశంకర్ ఈ చిత్రాన్ని షడ్వర్గాలు (అరి షడ్వర్గాలు) అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కించారు. ఇంతవరకు ఎవ్వరూ టచ్ చేయని ఈ పాయింట్‌తో రూపొందిన ఈ చిత్రం గత వారం విడుదలైంది.

Also Read : Vishnu Manchu: దీపావళికి టీవీలో ‘కన్నప్ప’

‘అరి’ చిత్రంలో చూపించిన కాన్సెప్ట్, ముఖ్యంగా చివర్లో ఇచ్చిన సందేశానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. క్లైమాక్స్‌లో కృష్ణుడి ఎంట్రీ, ఆయన అరి షడ్వర్గాల గురించి ఇచ్చే సందేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దర్శకుడు జయశంకర్ ఈ చిత్రాన్ని మంచి సందేశాత్మక చిత్రంగా మలిచారంటూ ఆడియెన్స్ ఆయనపై ప్రశంసలు కురిపించారు. మీడియా, సోషల్ మీడియా, క్రిటిక్స్ సైతం చివరి 20 నిమిషాల గురించి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలోనూ ‘అరి’ చిత్రంపై పాజిటివ్ కామెంట్లే కనిపిస్తున్నాయి.

Also Read : Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ చిత్రపటానికి రైతుల పాలాభిషేకం

అరి షడ్వర్గాలను ప్రధాన అంశంగా తీసుకుని, ఆరు పాత్రలతో దర్శకుడు సమాజానికి మంచి సందేశాన్ని అందించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో వినోద్ వర్మ, అనసూయ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, సురభి ప్రభావతి వంటి నటీనటులు తమ తమ పాత్రలతో సినిమాకు ప్రాణం పోశారు. మొత్తానికి, దర్శకుడు జయశంకర్ ‘పేపర్ బాయ్’, ‘అరి’ అంటూ వరుసగా రెండు మంచి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డివైన్ ట్రెండ్‌ను విజయవంతంగా ఫాలో అవుతూ ‘అరి’ చిత్రం ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్లిపోయింది.

Exit mobile version