డైనమిక్ హీరో విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన డివైన్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కన్నప్ప’ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. థియేటర్లు మరియు ఓటీటీలలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని దీపావళి పండుగ సందర్భంగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేయనున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డా. ఎం. మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ దీపావళి పండుగను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు, ‘కన్నప్ప’ చిత్రాన్ని అక్టోబర్ 19న, మధ్యాహ్నం 12 గంటలకు జెమినీ టీవీ లో ప్రసారం చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసి, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
Also Read :Pawan Kalyan: పవన్ కల్యాణ్ చిత్రపటానికి రైతుల పాలాభిషేకం
గతంలో థియేటర్లలో విడుదలై ‘కన్నప్ప’ చిత్రం ప్రేక్షకులు, మీడియా వర్గాల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. భక్తిరసంతో కూడిన కథ, అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. అనంతరం ఓటీటీలో విడుదలైనప్పుడు కూడా ఈ చిత్రం టాప్ ట్రెండింగ్‌లో నిలిచి తన సత్తాను చాటుకుంది. ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్‌తో ఇంటిల్లిపాదిని అలరించడానికి సిద్ధమైంది. ఈ చిత్రంలో విష్ణు మంచుతో పాటు పాన్ ఇండియా స్టార్లు ప్రభాస్, బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శరత్ కుమార్ వంటి దిగ్గజ నటులు నటించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత సన్ నెట్‌వర్క్ ఒకేసారి నాలుగు భాషల్లో ఒకే చిత్రాన్ని ప్రసారం చేస్తుండటం ‘కన్నప్ప’కు దక్కిన మరో గౌరవంగా చిత్ర బృందం చెబుతోంది.