Ari : ఆకట్టుకున్న షడ్వర్గాల కాన్సెప్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో డివైన్ ట్రెండ్ నడుస్తోంది. ‘కార్తికేయ 2’, ‘కాంతార’, ‘హనుమాన్’, ‘మిరాయ్’, ‘కాంతార చాప్టర్ 1’ వంటి చిత్రాలన్నీ కూడా మైథలాజికల్ టచ్‌తో కూడిన డివైన్ వైబ్స్‌ను అందించి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ, ‘అరి’ అనే చిత్రం ఒక సరికొత్త మైథలాజికల్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పేపర్ బాయ్’ దర్శకుడు జయశంకర్ ఈ చిత్రాన్ని షడ్వర్గాలు (అరి షడ్వర్గాలు) అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కించారు. ఇంతవరకు ఎవ్వరూ టచ్ చేయని ఈ పాయింట్‌తో రూపొందిన ఈ చిత్రం గత వారం విడుదలైంది.
Also Read : Vishnu Manchu: దీపావళికి టీవీలో ‘కన్నప్ప’
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
‘అరి’ చిత్రంలో చూపించిన కాన్సెప్ట్, ముఖ్యంగా చివర్లో ఇచ్చిన సందేశానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. క్లైమాక్స్‌లో కృష్ణుడి ఎంట్రీ, ఆయన అరి షడ్వర్గాల గురించి ఇచ్చే సందేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దర్శకుడు జయశంకర్ ఈ చిత్రాన్ని మంచి సందేశాత్మక చిత్రంగా మలిచారంటూ ఆడియెన్స్ ఆయనపై ప్రశంసలు కురిపించారు. మీడియా, సోషల్ మీడియా, క్రిటిక్స్ సైతం చివరి 20 నిమిషాల గురించి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలోనూ ‘అరి’ చిత్రంపై పాజిటివ్ కామెంట్లే కనిపిస్తున్నాయి.
Also Read : Pawan Kalyan: పవన్ కల్యాణ్ చిత్రపటానికి రైతుల పాలాభిషేకం
అరి షడ్వర్గాలను ప్రధాన అంశంగా తీసుకుని, ఆరు పాత్రలతో దర్శకుడు సమాజానికి మంచి సందేశాన్ని అందించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో వినోద్ వర్మ, అనసూయ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, సురభి ప్రభావతి వంటి నటీనటులు తమ తమ పాత్రలతో సినిమాకు ప్రాణం పోశారు. మొత్తానికి, దర్శకుడు జయశంకర్ ‘పేపర్ బాయ్’, ‘అరి’ అంటూ వరుసగా రెండు మంచి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డివైన్ ట్రెండ్‌ను విజయవంతంగా ఫాలో అవుతూ ‘అరి’ చిత్రం ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్లిపోయింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?