AR Rahman: అల్మారలో దాచుకున్న అవార్డుల గురించి ఆలోచిస్తే లాభం లేదు!

Ar Rahman Controversy

Ar Rahman Controversy

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానాల కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఇంటర్వ్యూ ప్రస్థానంలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ మేస్ట్రో ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నప్పుడు తనకు కలిగిన అనుభవాలను డైరెక్టర్ బుచ్చిబాబుతో పంచుకుంటూ.. రామ్ చరణ్ క్యారెక్టర్ ట్రాన్స్‌ఫార్మేషన్ చూసి తాను ఎంతగా ఆశ్చర్యపోయానో ఎమోషనల్‌గా వివరించారు.

“సార్, నేను దుబాయ్ వచ్చినప్పుడు మీరు తెల్లవారుజామున 5:30 లేదా 6:00 గంటలకే లేచి, మీ విల్లా కింద ఉన్న అండర్‌గ్రౌండ్ రూమ్‌లో ఒంటరిగా కూర్చుని వర్క్ చూసుకుంటున్నారు. ఒక 65-75 ఏళ్ల వయసున్న ఓల్డ్ లేడీ మాత్రమే మీకు టీ, కాఫీ అందిస్తూ అక్కడ ఉన్నారు. ఈ వయసులో కూడా అంత ఎర్లీ మార్నింగ్ వర్క్ చేయడం మీకే సాధ్యం సార్” అని బుచ్చిబాబు కొనియాడారు. దానికి రెహమాన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.. “సినిమా ఇండస్ట్రీ అనేది ప్రవహించే నీరు లాంటిది, స్టాగ్నెంట్ (నిల్వ నీరు) గా ఉండకూడదు. ఎప్పుడూ కొత్త టాలెంట్ వస్తూనే ఉంటుంది. అల్మారీలో నేను దాచుకున్న పాత అవార్డుల గురించి ఆలోచిస్తే లాభం లేదు, ‘ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు?’ అనేదే ముఖ్యం. ఇప్పుడు యూట్యూబ్‌లో ఆడియన్స్ ప్రతి సెకన్ సౌండ్‌ను అబ్సర్వ్ చేస్తున్నారు. మునుపటిలా కాకుండా సాంగ్‌లో 3 నిమిషాల 43 సెకన్ల దగ్గర వచ్చే చిన్న హమ్మింగ్‌ బిట్‌ను కూడా విడిగా కట్ చేసి చూస్తున్నారు, ప్రేక్షకులు అంతలా మారిపోయారు” అని స్పష్టం చేశారు.

×
×
Ad