AR Rahman: అల్మారలో దాచుకున్న అవార్డుల గురించి ఆలోచిస్తే లాభం లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానాల కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఇంటర్వ్యూ ప్రస్థానంలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ మేస్ట్రో ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నప్పుడు తనకు కలిగిన అనుభవాలను డైరెక్టర్ బుచ్చిబాబుతో పంచుకుంటూ.. రామ్ చరణ్ క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మేషన్ చూసి తాను ఎంతగా ఆశ్చర్యపోయానో ఎమోషనల్‌గా వివరించారు.
“సార్, నేను దుబాయ్ వచ్చినప్పుడు మీరు తెల్లవారుజామున 5:30 లేదా 6:00 గంటలకే లేచి, మీ విల్లా కింద ఉన్న అండర్‌గ్రౌండ్ రూమ్‌లో ఒంటరిగా కూర్చుని వర్క్ చూసుకుంటున్నారు. ఒక 65-75 ఏళ్ల వయసున్న ఓల్డ్ లేడీ మాత్రమే మీకు టీ, కాఫీ అందిస్తూ అక్కడ ఉన్నారు. ఈ వయసులో కూడా అంత ఎర్లీ మార్నింగ్ వర్క్ చేయడం మీకే సాధ్యం సార్” అని బుచ్చిబాబు కొనియాడారు. దానికి రెహమాన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.. “సినిమా ఇండస్ట్రీ అనేది ప్రవహించే నీరు లాంటిది, స్టాగ్నెంట్ (నిల్వ నీరు) గా ఉండకూడదు. ఎప్పుడూ కొత్త టాలెంట్ వస్తూనే ఉంటుంది. అల్మారీలో నేను దాచుకున్న పాత అవార్డుల గురించి ఆలోచిస్తే లాభం లేదు, ‘ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు?’ అనేదే ముఖ్యం. ఇప్పుడు యూట్యూబ్‌లో ఆడియన్స్ ప్రతి సెకన్ సౌండ్‌ను అబ్సర్వ్ చేస్తున్నారు. మునుపటిలా కాకుండా సాంగ్‌లో 3 నిమిషాల 43 సెకన్ల దగ్గర వచ్చే చిన్న హమ్మింగ్ బిట్‌ను కూడా విడిగా కట్ చేసి చూస్తున్నారు, ప్రేక్షకులు అంతలా మారిపోయారు” అని స్పష్టం చేశారు.
Also Read
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
తాజావార్తలు
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!