AR Rahman Controversy: భారత్ నాకు ఇళ్లు, గురువు.. ఏఆర్ రెహమాన్ యూ-టర్న్!
- ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బాలీవుడ్
- వివాదం ముదరడంతో క్లారిటీ ఇచ్చిన రెహమాన్
- తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్
- భారత్ తనకు స్ఫూర్తి అంటూ వీడియో రిలీజ్ చేసిన రెహమాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లో అవకాశాలు తగ్గడంపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు అవకాశాలు తగ్గడానికి పలు కారణాలు ఉండొచ్చని, అందులో మతం కూడా ఒక కారణం అయి ఉండవచ్చేమో అనే భావన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. బాలీవుడ్ వర్గాల్లో భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు మద్దతు తెలపగా, మరికొందరు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. రెహమాన్ వ్యాఖ్యలను కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు, సోషల్ మీడియా యూజర్లు వివాదాస్పదంగా అభివర్ణించారు. మతాన్ని ప్రస్తావించడం అవసరమా? అనే ప్రశ్నలు లేవనెత్తారు.
Also Read: OnePlus 15T Launch: 7000mAh బ్యాటరీ, IP69 రేటింగ్.. మరెన్నో మతిపోయే ఫీచర్స్‌తో వన్‌ప్లస్ 15టీ!
Also Read
తన వ్యాఖ్యలపై వివాదం ముదరండతో ఏఆర్ రెహమాన్ స్వయంగా స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని స్పష్టం చేస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాను ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టాలనుకోలేదని చెప్పారు. వీడియోలో రెహమాన్ మాట్లాడుతూ… ‘భారత్ నాకు ఇల్లు. ఇక్కడే నేను సంగీతాన్ని నేర్చుకున్నాను. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలే నాకు గురువులు. నేను ఎప్పుడూ దేశాన్ని, ప్రజలను విమర్శించలేదు. భారత్ నాకు ఎప్పటికీ స్ఫూర్తి. సంగీతానికి, కళాకారులకు గౌరవం తగ్గిందన్నదే నా ఉద్దేశం. ఒకప్పుడు సంగీతానికి ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు తగ్గుతోంది. కమర్షియల్ అంశాలే ఎక్కువ అవుతున్నాయి. నా వ్యాఖ్యలు మతంతో ముడిపెట్టి చూడడం సరైంది కాదు. నేను ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. కళ, సంగీతం, దేశం పట్ల నా ప్రేమ ఎప్పటికీ మారదు. నా నిజాయితీని గుర్తిస్తారని ఆశిస్తున్నా’ అని వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.
తాజావార్తలు
-
Railway Group Ticket Booking: రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో భారీ మార్పు.. కొత్త రూల్స్ ఇవే
-
Astrology: నవంబర్ 22 ఆదివారం దినఫలాలు.. ఈ పూజలు చేయండి కలిసి వస్తుంది..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!