గత సంవత్సరం సూర్యతో కలసి ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో నటించింది అపర్ణ బాలమురళి. ఎయిర్ డక్కన్ అధినేత గోపీనాథ్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య హీరో. ఆయన భార్యగా నటించిన అపర్ణ నటనను అటు తమిళ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగువారు కూడా ఎంతగానో ఇష్టపడ్డారు. ఇప్పుడు అపర్ణ లేడీఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ‘ఉలా’ పేరుతో రానున్న ఈ సినిమాకు ప్రవీణ్ ప్రభారామ్ దర్శకుడు. ఉగాది సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఒంటరి యువతి పడే మానసిక సంఘర్షణతో పాటు తన చుట్టూ ఉన్న మనుషులతో ఎలాంటి సమస్యలను ఫేస్ చేసింది. వాటినుంచి ఎలా బయటపడిందన్నది ఈ ఉలా సినిమాలో చూపిస్తున్నామంటున్నారు దర్శకులు. మలయాళంతో పాటు అన్ని దక్షిణాది భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తామంటున్నారు. ఈ కథ అనుకున్నపుడే తన మదిలోకి వచ్చిన ఏకైక నటి అపర్ణ బాలమురళి అని చెబుతూ పక్కింటి అమ్మాయిలా కనిపించే తనే ఈ పాత్రకు సరైన నటి అంటున్నారు దర్శకుడు ప్రవీణ్.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ ను త్రిసూర్, ఇడుక్కిలో జరపనున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తామంటున్నారు. అపర్ణ ఫస్ట్ లుక్ కి అటు సినిమా వారితో పాటు ఆడియన్స్
లోనూ ఆద్భుతమైన స్పందన లభిస్తోంది.