Site icon NTV Telugu

Balakrishna: బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్న ఏపీ హోమ్ మంత్రి

Balakrishna

Balakrishna

తాజాగా నందమూరి బాలకృష్ణ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు హోంమంత్రి అనిత. స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాళ్లకు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత నమస్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు వెంటనే బాలయ్య ఆశీస్సులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇదే సమయంలో పక్కనే ఉన్న మరో మంత్రి సవిత కూడా వెంటనే బాలయ్య కాళ్ళకు వినయంగా నమస్కరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Also Read: Pottel Trailer: అరాచకం అయ్యా.. అజయ్ నట విశ్వరూపం

ఇక ఇటీవల జరిగిన సార్వతిక ఎన్నికల్లోనూ గెలిచి.. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా బాలయ్య హ్యాట్రిక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక పాయకరావుపేట నుంచి పోటీ చేసిన అనిత కూడా గెలిచి ఏపీ హోంమంత్రి అయ్యారు. ఇక నందమూరి బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే ఆయన ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నారు. ఆ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్నారు. ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉన్నా మరోపక్క రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. పార్టీ నేతల మీటింగ్ కోసం వెళ్లిన సందర్భంగా బాలకృష్ణ కాళ్ళకు మంత్రులు పాదనమస్కారం చేశారు.

 

Exit mobile version