Pawan Kalyan: కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • తిరుమల లడ్డు తయారీలో కల్తీ అంశంలో పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష
  • ఆ దీక్ష విరమించేందుకు తిరుమలకు పవన్‌ కల్యాణ్‌
  • కాలినడకన తిరుమలకు పయనమైన పవన్‌ కళ్యాణ్
Pawan Kalyan

Pawan Kalyan

తిరుమల లడ్డు తయారీలో కల్తీ అంశంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈరోజు ఆ దీక్ష విరమించేందుకు తిరుమలకు బయల్దేరారు.
Pawan Kalyan1
అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు పవన్‌. పవన్ వెంట ఆయన సన్నిహితుడు, సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు. ఇక తిరుమలకు పవన్‌ రాకతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

ఈ క్రమంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పవన్‌ కల్యాణ్.. శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారని సమాచారం.

ఇక రేపు ఉదయం 8:15 నిమిషాలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఉదయం 9:15 గంటల నుంచి 11:30 గంటల వరకు అన్నదానం సముదాయం, క్యూలైన్లను పవన్ తనిఖీ చేయనున్నారు.

సాయంత్రం 5:30 గంటలకు తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో పాల్గొననున్న పవన్‌ రాత్రి 8:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరంకు పవన్‌కల్యాణ్ బయలుదేరి వెళ్లనున్నారు.