Anupama Parameswaran-Bhogi: ‘భోగి’ ప్రమోషన్స్‌కు అనుపమ దూరం.. కారణం అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anupama Parameswaran Skips Bhogi Promotions: ‘చార్మింగ్ స్టార్’ శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భోగి’. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకుడు కాగా.. కె.కె. రాధామోహన్ నిర్మాత. పలుమార్లు వాయిదాపడ్డ భోగి.. ఎట్టకేలకు శుక్రవారం (నవంబర్ 27) థియేటర్లలో విడుదల అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఆదివారం రాత్రి ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించగా.. మంగళవారం రాత్రి మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ రెండు ఈవెంట్లకు లీడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హాజరుకాలేదు. మరోవైపు కీలక పాత్ర చేసిన డింపుల్ హయాతి ప్రమోషన్స్‌లో తెగ సందడి చేస్తున్నారు. దాంతో సోషల్ మీడియా, ఫిల్మ్ నగర్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
భోగి మూవీ కోసం మొదట డింపుల్ హయాతిని సహాయ పాత్ర కోసమే తీసుకున్నారని, ఆ తర్వాత కథలో మార్పులు చేయడంతో ఆమె పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం లభించిందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డింపుల్‌ను ప్రమోషన్లలో హైలైట్ చేయాలనే ఉద్దేశంతోనే అనుపమను పక్కన పెడుతున్నారంటూ కొందరు చర్చించుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు అనుపమకు మొదట చెప్పిన కథలో తర్వాత చాలా మార్పులు చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఆమె సినిమా ట్రైలర్, టీజర్, పాటలకు సంబంధించిన పోస్టులను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయలేదని అంటున్నారు. అయితే ఈ ప్రచారంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
Also Read
- Sharwanand: నన్ను కూడా సీఎంను చేస్తారా?.. హీరో శర్వానంద్ కీలక వ్యాఖ్యలు!
- Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
- Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
- Tharun Bhascker: డ్యూటీ ఎక్కుతున్నా.. దిగే ప్రసక్తే లేదు! ఇకపై తన రూట్ మారుస్తున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్!
రాబోయే భోగి ప్రమోషనల్ ఈవెంట్లలోనైనా అనుపమ పరమేశ్వరన్ పాల్గొంటారా? అన్నది ఇప్పుడు అన్నది ఆసక్తికరంగా మారింది. సినిమాలో కథానాయికగా నటించిన అనుపమను ప్రమోషన్లలో భాగం చేయకపోతే.. సినిమాకు సంబంధించిన ప్రచారంపై ప్రభావం పడే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తలపై భోగి టీమ్ స్పందిస్తే కానీ.. అసలు విషయం తెలుస్తుంది. ప్రస్తుతం అనుపమ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. భోగితో హిట్ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.
తాజావార్తలు
-
Anupama Parameswaran-Bhogi: ‘భోగి’ ప్రమోషన్స్‌కు అనుపమ దూరం.. కారణం అదేనా?
-
Shenzhou-24 Mission: చరిత్ర సృష్టించిన చైనా.. తియాంగాంగ్ స్టేషన్‌కు షెన్‌జౌ-24.. తొలి విదేశీ వ్యోమగామిగా పాకిస్థానీ!
-
Delhi Gang Rape Case: ఢిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అరెస్టు
-
IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..
-
Sharwanand: నన్ను కూడా సీఎంను చేస్తారా?.. హీరో శర్వానంద్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!
-
UAE Captain Basil Hameed: వైభవ్‌ను ఆపడం చాలా కష్టం.. ఓటమి షాక్ నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుంది.!
-
Violence Against Women: హింసకు కొత్త రూపం.. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రత ఏది.?
-
Tilak Varma: ఎలాంటి మాటల్లేవ్.. నేను చూసిన ‘ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే’..! వైభవ్ పై కెప్టెన్ ప్రశంసలు..
-
Vaibhav Sooryavanshi: రికార్డ్స్ గురించే ఆలోచించలేదు.. అలా ఉండడంతో స్వేచ్ఛగా ఆడేసా..!