Parada Teaser : ఆసక్తికరంగా పరదా టీజర్.. చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన తొలి సినిమా ‘సినిమా బండి’తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఇప్పుడు తన రెండవ చిత్రం ‘పరదా’తో వస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పాపులరైన రాజ్, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఆనంద మీడియా బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్ ప్రముఖ నటి సంగీత వంటి అద్భుతమైన తారాగణం వుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ , కాన్సెప్ట్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు దుల్కర్ సల్మాన్ ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ టీజర్ కథానాయిక సుబ్బు పాత్రను అనుపమ పరమేశ్వరన్ వాయిస్ ఓవర్ ద్వారా పరిచయం చేస్తుంది. కథకుడి ప్రకారం, సుబ్బు చాలా దూరం ప్రయాణించి తన జీవితాన్ని ముగించడానికి 70 లక్షలు చెల్లిస్తుంది. ఆ తర్వాత సుబ్బు, దర్శన రాజేంద్రన్, సంగీత పోషించిన మరో ఇద్దరు ప్రధాన పాత్రలతో కలిసి సాహసోపేతమైన యాత్రకు బయలుదేరడం ఆసక్తిగా వుంది. అయితే, సుబ్బు ప్రయాణంలో సీక్రెట్ ఎజెండా వుంది.
The Devil’s chair: ఏఐ టెక్నాలజీతో ది డెవిల్స్ చైర్
Also Read
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
- Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
టీజర్ ముందుకు సాగుతున్న కొద్దీ, గ్రామంలోని పాత ఆచారాలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాలను రివిల్ చేస్తుంది, వాటిలో మహిళలు ముఖాలను కప్పుకోవడం, సతి లాంటి ఆచారం ఉన్నాయి. చివర్లో, అనుపమ పరమేశ్వరన్ ముఖం రివిల్ కావడం మిస్టిరియస్ ఎక్సపీరియన్స్ ఇస్తోంది. తన మొదటి చిత్రం సినిమా బండి లాగానే, పరదా దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల చేసిన మరొక యూనిక్ ప్రయత్నం. కథలోకి ఒక గ్లింప్స్ అందించే ఈ టీజర్, గొప్ప కథనం,మ అత్యున్నత స్థాయి నిర్మాణ సాంకేతిక ప్రమాణాలతో ఆకట్టుకుంటుంది. అనుపమ పరమేశ్వరన్ రూరల్ అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది, మరియు ఆమె పాత్రకు సరిగ్గా సరిపోతుంది. దర్శన రాజేంద్రన్మ సంగీత ఉండటం ఈ చిత్రానికి గ్రేట్ వాల్యూస్ యాడ్ చేశారు. మృదుల్ సుజిత్ సేన్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలను, గ్రామీణ పరిస్థితులను అందంగా చూపించారు. గోపీ సుందర్ నేపథ్య సంగీతం ఎక్స్ పీరియన్స్ ని మరింత పెంచుతుంది, ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ షార్ఫ్ గా వుంది. ఆనంద మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తంమీద, టీజర్ తెలుగు, మలయాళ భాషలలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలను నెలకొల్పింది.
తాజావార్తలు
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో నెలల తరబడి తాజాగా..!
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
-
AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
-
Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్‌పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!