ANR Centenary: 31 సిటీల్లో ANR 100 ఫిల్మ్ ఫెస్టివల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ANR Centenary In 31 Cities : నటసామ్రాట్, పద్మవిభూషణ్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ NFDC-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ANR ఐకానిక్ ఫిలిం ‘దేవదాసు’ స్క్రీనింగ్ తో ఈ ఫెస్టివల్ గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘దేవదాసు’ (1953), ‘మిస్సమ్మ’ (1955) ‘మాయాబజార్’ (1957), ‘భార్య భర్తలు’ (1961), ‘గుండమ్మ కథ’ (1962), ‘డాక్టర్ చక్రవర్తి’ (1964), ‘సుడిగుండాలు’ (1968), ‘ప్రేమ్ నగర్’ (1971), ‘ప్రేమాభిషేకం’ (1981) ‘మనం’ (2014) సహా ANR ల్యాండ్‌మార్క్ మూవీస్ దేశవ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ 10 మాస్టర్ పీస్ మూవీ ప్రింట్‌లను 4Kలో పునరుద్ధరించడానికి చొరవ తీసుకున్నాయి. అద్భుతమైన క్యాలిటీలో ఈ క్లాసిక్స్ ని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు.
Prakash Raj: లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్ కి ప్రకాష్ రాజ్ కౌంటర్
Also Read
- Drishyam 3 : మోహన్ లాల్ ఖాతాలో మరో రికార్డ్.. జస్ట్ 7 రోజుల్లో సెన్సేషన్
- Suriya : ఆగస్టు 14న 'విశ్వనాథ్ అండ్ సన్స్' రిలీజ్ ఫిక్స్
- Obsession : 0.75 మిలియన్ డాలర్లతో సినిమా తీసిన యూట్యూబర్.. కలెక్షన్ల వర్షం కురిపించిన ఆడియన్స్
- NTR : తెలుగువారి ఆత్మగౌరవం.. అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం.. 'ఎన్టీఆర్' 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి!
అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలని అక్కినేని కుటుంబం ఘనంగా నిర్వహించింది. అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఇరు రాష్ట్రాలలోని అక్కినేని అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ కి తరలివచ్చి అక్కినేనికి అంజలి ఘటించారు. అక్కినేని కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా 600 వందల మంది అభిమానులకు బట్టలు బహుకరించారు. ఇక ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాన్నగారు నవ్వుతూ మాకు జీవితాన్ని నేర్పించారు. అందుకే ఆయన పేరు తలచుకుంటే నవ్వుతూనే ఉంటారు. శివేంద్ర గారికి థాంక్స్. దేవదాస్ తో పాటు మరికొన్ని సినిమాలు చూడబోతున్నారు. వాళ్ళు చేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా వున్నాయి. ఆడియన్స్ కి వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ ఉంటుంది. 31 సిటీల్లో ఈ ఫెస్టివల్ చేస్తున్నారు. నార్త్ లో ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తుందని శివేంద్ర చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నాన్న గారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా హ్యాపీగా వుంది. పోస్ట్ మాస్టర్ జనరల్ బీఎస్ రెడ్డి గారికి థాంక్ యూ. ఈ శత జయంతి రోజున నాన్న గారి స్టాంప్ రిలీజ్ చేయడం చాలా అనందంగా వుంది. ఈ వేడుకకు వచ్చిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ సో మచ్. శత జయంతిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ని నాన్న గారి సీనియర్ అభిమానులు రక్తదానం, అన్నదానం లాంటి మంచి కార్యక్రమలు చేశారు. వారందరికీ థాంక్ యు వెరీ మచ్. మీ ప్రేమ అభిమానం మర్చిపోలేనేది. ప్రతి రెండేళ్ళకు ఏఎన్ఆర్ అవార్డ్ ఇస్తున్నాం. ఈ ఏడాది ఏఎన్ఆర్ అవార్డ్ చిరంజీవి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం చెప్పగానే చిరంజీవి గారు చాలా ఎమోషనల్ హాగ్ చేసుకొని ఏఎన్ఆర్ గారి శత జయంతి ఏడాదిలో ఇవ్వడం చాలా ఆనందంగా వుందని చెప్పారు. దీనికి కంటే పెద్ద అవార్డ్ లేదని అన్నారు. అమితాబ్ బచ్చన్ గారు ఆవార్డ్ ప్రధానం చేస్తారు. అక్టోబర్ 28 ఈ ఫంక్షన్ చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.
- Tags
తాజావార్తలు
-
Megastar Chiranjeevi : ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా ఆయనే ముందుంటాడు.. మరోసారి నిరూపించిన మెగాస్టార్..!
-
Vaibhav Sooryavanshi: అది బ్యాటింగ్ కాదు.. వైభవ్ బ్యాట్‌లో ఏదో ఉంది.. కీలక వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఆటగాళ్లు..
-
Vibhav suryavanshi: ఢిల్లీ క్యాపిటల్స్ పశ్చాత్తాపం.. కొన్ని లక్షల కోసం వైభవ్‌ను వదులుకున్నారు..
-
Siddaramaiah: కర్ణాటకలో పవర్ ఛేంజ్.. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా
-
DK Shivakumar: వందల కోట్ల షాపింగ్ మాల్, కోట్ల సంపద.. కర్ణాటక కొత్త సీఎం వైభవం..
ట్రెండింగ్
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!