NTV Telugu Site icon

Kalki 2898 AD: రెబల్ స్టార్ ఖాతాలో మరో రికార్డు… కల్కి కలెక్షన్స్ ఎంతంటే ..?

Kalki

Kalki

Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రం కల్కి2898AD. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూ రికార్డు కలెక్షన్స్ రాబడుతోందీ. వైజయంతి బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మాతగా భారీబడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయి.

Read Also: Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి వారాహి ఉత్సవాలు, సారె మహోత్సవాలు..

కాగా కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ అల్ టైమ్ హిట్ దిశగా దూసుకెళ్తోంది. నైజాంలో ఈ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నైజాం నయానవాబ్ గా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 242కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అటు తమిళంలో రూ. 24 కోట్లు కొల్లగొట్టింది. బాలీవుడ్ మార్కెట్ నుండి రూ. 164 కోట్లు రాబట్టింది. మలయాళంలో రూ .15 కోట్లు వసూలు చేయగా, కన్నడ ఇండస్ట్రీలో రూ. 25 కోట్లు రాబట్టి ప్రభాస్ గత చిత్ర తాలూకు చిత్రాల రికార్డులు బద్దలు కొట్టింది. ఓవర్సీస్ లో $14.5M గ్రాస్ తో ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు నమోదు చేసింది.

Read Also: Ashada Masam: ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఐశ్వర్యవంతులవుతారు..

మొత్తంగా 8 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా రూ. 363.09 కోట్ల షేర్, రూ.750 కోట్ల గ్రాస్ రాబట్టి సక్సెఫుల్ గా ప్రదర్శించబడుతుంది. ఈ కలెక్షన్లతో అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ సాధించి, క్లీన్ హిట్ సాధించే దిశగా పరుగులు తీస్తోంది కల్కి. నేడు, రేపు సెలవులు కావడంతో బాక్సఫీస్ దగ్గర పెద్ద నంబర్ కనిపించే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత సరైన సినిమాలు లేక బోసిపోసిన థియేటర్లకు కల్కిరూపంలో భారీ ఊరట లభించింది. ఇక, కల్కి చిత్రం సూపర్ హిట్ తో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషిగా ఉన్నారు. కల్కి – 2 ఎప్పుడు వస్తుందా? అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కల్కి -2 ఇప్పటివరకు 30 శాతం మాత్రమే షూటింగ్ పూర్తిచేశామని మిగిలిన భాగం అతి త్వరలో మొదలుపెట్టి 2025 నాటికి విడుదల చేస్తామని నిర్మాత అశ్వనీదత్ ఇంటర్వూలో వెల్లడించారు.

Show comments