NTV Telugu Site icon

Kalki: బుక్ మైషోలో ‘బుజ్జి’ గాడు రికార్డు…ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయంటే ..?

Untitled Design (3)

Untitled Design (3)

రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ “కల్కి 2898 ఏడీ”. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ రికార్డులు నమోదు చేస్తుంది.

కేవలం రెండు వారాల్లోనే కల్కి ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ లో 18మిలియన్ల కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టి నాన్ బాహుబలి-2 గా కల్కి నిలిచింది. విడుదలైన అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవడం, ఇప్పటికి కల్కి కలెక్షన్స్ స్టడీగా ఉండడంతో లాంగ్ రన్ కు కలిసి వచ్చే అంశం.

తాజగా కల్కి మరో రికార్డును తన పేరిట లిఖించింది. ఒకవైపు కలెక్షన్స్ పరంగా రికార్డులు నమోదు చేస్తూనే మరో వైపు టిక్కెట్ల అమ్మకాలలో ఆల్ టైమ్ రికార్డ్‌ను నెలకొల్పింది. ప్రముఖ సినిమా టికెట్స్ బుకింగ్ యాప్ ‘బుక్‌మైషో’ లో కల్కి జూన్ 27 నటి నుండి జులై 17వరకు మొత్తం 12.15 మిలియన్ల టికెట్స్ అమ్మకాలు జరిగాయని BMS తెలిపింది. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో రికార్డు, అలాగే బుక్ మై షోలో కూడా రికార్డు అని పేర్కొంది. బుక్‌మైషోలో టికెట్స్ బుకింగ్ లో ఇప్పటివరకు అత్యదికంగా టికెట్స్ అమ్ముడయిన సినిమాగా బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ చిత్రం జవాన్ 12.01M బుకింగ్స్ ను కేవలం 20 రోజుల్లోనే ‘ప్రభాస్ కల్కి’ బద్దలు కొట్టి తన పేరిట సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇది రికార్డు కాదు రికార్డులకే రికార్డు.

Also  Read: Dheeraj Mogilineni : చిన్న సినిమాలకు ఇక నుండి ఒకటే రూల్ ..అదేమంటే..?

Show comments